కల్యాణోత్సవాలు విజయవంతం చేద్దాం | antarvedi swamy festival next month | Sakshi
Sakshi News home page

కల్యాణోత్సవాలు విజయవంతం చేద్దాం

Published Wed, Jan 18 2017 10:45 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

antarvedi swamy festival next month

సఖినేటిపల్లి (రాజోలు) : 
సమన్వయంతో శ్రీలక్షీ్మనృసింహస్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు విజయవంతం చేయాలని జేసీ ఎస్‌.సత్యనారాయణ అధికారులకు సూచించారు. ఫిబ్రవరి మూడు నుంచి 11 వరకు నిర్వహించనున్న శ్రీస్వామివారి కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై అంతర్వేది ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం జేసీ సమీక్షించారు. స్థానిక మంచినీటి చెరువు మరమ్మతులు పూర్తి చేసి, ఈ నెల 27లోగా నీటితో నింపాలని ఇరిగేష¯ŒS అధికారులను జేసీ అదేశించారు. దండుపుంత రోడ్డు గండ్లు పూడ్చాలని, పుణ్యక్షేత్రానికి తాగునీటి సమస్య లేకుండా చూడాలని, సముద్రస్నానాల రోజున సముద్రంలో రోప్‌ పార్టీని ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ శాఖలను ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ చిక్కాల వెంకట్రావు కోరారు. స్వామివారితో సముద్రం స్నానం చేసే ప్రముఖుల జాబితా, వారికి డ్రెస్‌కోడ్‌ ఇవ్వాలని అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్‌ ఆలయ అధికారులకు తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 70 మంది దేవాదాయ శాఖ సిబ్బందిని నియమిస్తున్నట్లు చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ రమేష్‌బాబు,  తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ అప్పారావు, భక్తులకు మెరుగైన సేవలు అందజేస్తామని అమలాపురం డీఎస్పీ ఎల్‌.అంకయ్య తెలిపారు. బస్టాండ్, రాంబాగ్‌ వద్ద కిందికు వేలాడుతున్న విద్యుత్‌ వైర్లను సరిచేయాలని ఏపీ ట్రా¯Œ్సకో అధికారులకు తహసీల్దారు సుధాకర్‌ రాజు సూచించారు. 6, 7, 10 తేదీలలో తీర్థంలో మద్యం దుకాణాలు పూర్తిగా బంద్‌ చేస్తున్నామని అమలాపురం ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటిండెంట్‌ అధికారి జయరాజు తెలపగా, ఉత్సవాల తొమ్మిది రోజులు తీర్థంలో మద్యం, మాంసం దుకాణాలు లేకుండా చూడాలని ఉత్సవ కమిటీ మాజీ చైర్మ¯ŒS భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, సర్పంచ్‌ భాస్కర్ల గణపతి జేసీని కోరారు. రాజోలు, అమలాపురం, నర్సాపురం, భీమవరం డిపొల నుంచి సుమారు 150 బస్సులు నడుపుతామని ఆయా డిపొల అధికారులు పేర్కొన్నారు. బస్టాండ్‌ వద్ద తాత్కాలిక టాయిలెట్స్‌ సౌకర్యం పెంచాలని ఎంపీటీసీ వాసు కోరారు. ఉత్సవాల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత వహించాలని ఎంపీడీఓ ఎం.భాను ప్రకాష్, ఈఓపీఆర్డీ శ్రీహరిని, జేసీ ఆదేశించారు. ఎంపీపీ పప్పుల లక్ష్మి సరస్వతి, జెడ్పీటీసీ సభ్యురాలు రావి దుర్గ ఆలేంద్రమణి, సర్పంచ్‌లు పోతురాజు నాగేంద్రకుమార్, చొప్పల చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యుడు దొంగ నాగ సత్యనారాయణ, డివిజ¯ŒS వైద్యాధికారి పుష్కరరావు, రాజోలు సీఐ కృష్టాఫర్, ఎస్సైలు కృష్ణభగవాన్, విజయబాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement