antarvedi swamy
-
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం చూతము రారండి
దక్షిణకాశీగా పేరొందిన అంతర్వేది క్షేత్రం మహిమాన్వితమైనది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో విరాజిల్లుతున్న నర్శింహుని క్షేత్రాలలో ఇది పురాణ ప్రసిద్ధి చెందింది. లక్ష్మీ నరసింహస్వామి కల్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. స్వామివారి కల్యాణంలో భక్త కుటుంబాల వారే కర్తలుగా శుభ కార్యక్రమం జరిపించడంలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు.అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీ నృసింహస్వామి శిలారూపంలో పశ్చిమముఖంగా అవతరించారు. ఏటా మాఘమాసంçలో శుద్ధ సప్తమి (రథసప్తమి)నుంచి తొమ్మిది రోజులపాటు క్షేత్రంలో లక్ష్మీనరసింహుని దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు కనుల వైకుంఠంగా సాగుతాయి. మాఘమాసం సూర్యభగవానుడికి ప్రీతికరమైంది. సూర్యనారాయణమూర్తి సాక్షాత్తూ నారాయణ స్వరూపం. కలియుగంలో కనిపించే దేవుడు సూర్యనారాయణుడు. ఈ కారణంగా రథ సప్తమి రోజు నుంచి కళ్యాణోత్సవాలు మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. 7వ తేదీ దశమి నాడు రాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో జరగనున్నాయి. తరువాత 8వ తేదీ భీష్మ ఏకాదశి నాడు నూతన వధూవరులుగా మూర్తీభవించే శ్రీస్వామి, అమ్మవార్లను రథంపై ఉంచి యాత్ర నిర్వహించనున్నారు.12వ తేదీ మాఘ పౌర్ణమి రోజున వశిష్ఠ నదీ సంగమ ప్రాంతాలలో స్వామివారికి చక్ర స్నానం నిర్వహిస్తారు.భక్తజనమే పెళ్లిపెద్దలుగా...లక్ష్మీ నర్శింహస్వామి ఆలయాన్ని నిర్మించడం దగ్గర నుంచి ఆయన కళ్యాణంలో పలు కుటుంబాల వారు కర్తలుగా నిలబడి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నరసింహుని కళ్యాణంలో గోదావరికి ఇరువైపుల వారు భాగస్వాములే. ఇటు కోనసీమ వాసులతోపాటు.. అటు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కొన్ని కుటుంబాల వారు ఈ కళ్యాణతంతు లో తమ వంతు సేవలందిస్తారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి చక్రస్నానం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు వేద పండితుల చేతులు మీదుగా నిర్వహిస్తుండడం దశాబ్ధాల కాలంగా వస్తోంది. కళ్యాణానికి ముందు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, కుమార్తెలు చేసే అవకాశం బెల్లంకొండ, ఉండపల్లి వారి కుటుంబాల వారికి దక్కింది.రథసప్తమి రోజున నిర్వహించే ముద్రికాలంకణలో స్వామికి పంచెను బెల్లంకొండ కుటుంబాల వారు, అమ్మవారికి చీర ఉండపల్లి కుటుంబాల వారు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణ మహోత్సవంలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు రాజులు పెండ్లి కుమారుడి తరుపున నిలబడి కళ్యాణంలో పాల్గొంటారు. ప్రస్తుత వారసుడు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజాబహుద్దర్ కళ్యాణోత్సవాలకు కల్యాణం లో స్వామివారి తరపున నిలబడతారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరుకు చెందిన కలిదిండి కుటుంబానికి చెందిన సుబ్బరాజు ఆధ్వర్యంలో కల్యాణోత్సవానికి తలంబ్రాలను తీసుకువస్తున్నారు. అలాగే శృంగవరపాడుకు చెందిన రావి, యెనుముల కుటుంబాలకు చెందిన వారు రథోత్సవం రోజున స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకుని వస్తారు. పల్లకి ముందు భాగంలో రావి కుటుంబానికి చెందివారు... వెనుక భాగంలో యెనుముల కుటుంబాల వారు స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి రథం వరకు తీసుకు వస్తారు. ఇలా పలు కుటుంబాల వారు స్వామి వారి కళ్యాణంలో భాగస్వాములు.లక్ష్మీనరసింహుడే ఇక్కడ ఆదిదేవుడుసాధారణంగా పరమేశ్వరుడికే ఆదిదేవుడని పేరు. అయితే కలియుగంలో నర, మృగ అవతారంలో మొట్టమొదటిగా ఉద్భవించిన రూపం లక్ష్మీ నరసింహస్వామి. ఈ కారణంగా పరమశివుడినే కాకుండా లక్ష్మీ నర్శింహ స్వామివారిని కూడా ఆదిదేవునిగా కొలుస్తారు ఇక్కడ.ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు కల్యాణోత్సవాలు 7వ తేదీ రాత్రి 12.55 గంటలకు కళ్యాణ ముహూర్తం స్వామివారి కళ్యాణ తంతులో పలు కుటుంబాల భాగస్వామ్యం మొగల్తూరు రాజ వంశీయులతోపాటు సామాన్య కుటుంబాల వరకు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల రాక– నిమ్మకాయల సతీష్ బాబు, వి.ఎస్.బాపూజీసాక్షి, అమలాపురం, సఖినేటిపల్లిఫోటోలు: గరగ ప్రసాద్ -
దేవుళ్ల రథాలపై మరింత నిఘా..
ద్వారకా తిరుమల: ప్రముఖ ఆలయాల్లోని దేవతామూర్తుల రథాలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ కేసును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం జీవోను జారీ చేసింది. దీంతోపాటు హిందూ ఆలయాల్లో ఉండే రథాలపై నిఘా మరింతగా పెంచాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని ప్రధాన ఆలయాలకు సంబంధించిన రథాలను, అవి ఉండే ప్రాంతాలను పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలపై ఆలయ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న రథాన్ని, అలాగే క్షేత్ర ఉపాలయాలైన శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి రథాన్ని, లక్ష్మీపురంలోని జగన్నాథ స్వామివారి రథాన్ని, వాటి రథ శాలలను భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ద్వారకాతిరుమల ఇన్చార్జి ఎస్సై శ్రీహరిరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రథాల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను శ్రీవారి దేవస్థానం ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ వారికి వివరించారు. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి) పరిరక్షిస్తుంది ఇలా.. శ్రీవారి పాత రథాన్ని భక్తుల సందర్శనార్థం ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఉంచి, కొత్త రథాన్ని ఏడాదికి రెండుసార్లు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వినియోగిస్తున్నారు. ఈ రథ సంరక్షణార్థం దేవస్థానం కొన్నేళ్ల క్రితమే ఆర్సీసీ రూఫ్ కలిగిన రథశాలను నిర్మించింది. ఉత్సవం పూర్తయిన వెంటనే రథాన్ని అందులో ఉంచి, ఇనుప డోరును వేసి, తాళాలు వేస్తారు. ఇదే తరహాలో లక్ష్మీపురం ఆలయం వద్ద ఉన్న రథశాలల్లో కుంకుళ్లమ్మ, జగన్నాథుని రథాలను పరిరక్షిస్తున్నారు. ఈ రథ శాలలు పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లు కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే అంతర్వేది ఘటన తరువాత జిల్లాలో భీమవరంలోని సోమేశ్వర జనార్దన స్వామి రథం, ఆచంటలోని ఆచంటేశ్వర స్వామి రథం, అలాగే అత్తిలి మండలం బల్లిపాడులోని మధన వేణుగోపాల స్వామి రథం, దువ్వ వేణుగోపాలస్వామి రథం, కామవరపుకోటలోని వీరభద్ర స్వామి రథం ఇలా పలు ప్రముఖ దేవాలయాల్లోని రథాలపై పోలీసులు నిఘా పెంచారు. వాటి రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. (చదవండి: ‘అంతర్వేది’పై సీబీఐ..) శ్రీవారి దేవస్థానం రథాలకు ఇన్సూరెన్స్.. శ్రీవారి రథంతోపాటు, కుంకుళ్లమ్మ, జగన్నాథుని రథాలు ఉండే రథశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ రథశాలల వద్ద ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో హోంగార్డులు, అలాగే సెక్యూరిటీ గార్డులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే చినవెంకన్న దేవస్థానం అధికారులు యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మూడు రథాలకు సుమారు రూ.40వేలకు పైగా వెచ్చించి ఇన్సూరెన్స్ చేయించారు. ఏం ఢోకా లేదు శ్రీవారి దేవస్థానం రథాలకు ఏ ఢోకా లేదు. మూడు రథాలనూ ప్రత్యేకంగా నిర్మించిన ఆర్సీసీ రూఫ్ కలిగిన రథ శాలల్లోనే భద్రపరుస్తున్నాం. రాత్రి వేళల్లో రథ శాలల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నాం. అలాగే రథాలకు ఇన్సూరెన్స్ కూడా చేయించాం. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం రథాల పరిరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. – రావిపాటి ప్రభాకరరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
కల్యాణోత్సవాలు విజయవంతం చేద్దాం
సఖినేటిపల్లి (రాజోలు) : సమన్వయంతో శ్రీలక్షీ్మనృసింహస్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు విజయవంతం చేయాలని జేసీ ఎస్.సత్యనారాయణ అధికారులకు సూచించారు. ఫిబ్రవరి మూడు నుంచి 11 వరకు నిర్వహించనున్న శ్రీస్వామివారి కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై అంతర్వేది ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం జేసీ సమీక్షించారు. స్థానిక మంచినీటి చెరువు మరమ్మతులు పూర్తి చేసి, ఈ నెల 27లోగా నీటితో నింపాలని ఇరిగేష¯ŒS అధికారులను జేసీ అదేశించారు. దండుపుంత రోడ్డు గండ్లు పూడ్చాలని, పుణ్యక్షేత్రానికి తాగునీటి సమస్య లేకుండా చూడాలని, సముద్రస్నానాల రోజున సముద్రంలో రోప్ పార్టీని ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ శాఖలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు కోరారు. స్వామివారితో సముద్రం స్నానం చేసే ప్రముఖుల జాబితా, వారికి డ్రెస్‌కోడ్ ఇవ్వాలని అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్ ఆలయ అధికారులకు తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 70 మంది దేవాదాయ శాఖ సిబ్బందిని నియమిస్తున్నట్లు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ రమేష్‌బాబు, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ అప్పారావు, భక్తులకు మెరుగైన సేవలు అందజేస్తామని అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య తెలిపారు. బస్టాండ్, రాంబాగ్ వద్ద కిందికు వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని ఏపీ ట్రా¯Œ్సకో అధికారులకు తహసీల్దారు సుధాకర్ రాజు సూచించారు. 6, 7, 10 తేదీలలో తీర్థంలో మద్యం దుకాణాలు పూర్తిగా బంద్ చేస్తున్నామని అమలాపురం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటిండెంట్ అధికారి జయరాజు తెలపగా, ఉత్సవాల తొమ్మిది రోజులు తీర్థంలో మద్యం, మాంసం దుకాణాలు లేకుండా చూడాలని ఉత్సవ కమిటీ మాజీ చైర్మ¯ŒS భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, సర్పంచ్ భాస్కర్ల గణపతి జేసీని కోరారు. రాజోలు, అమలాపురం, నర్సాపురం, భీమవరం డిపొల నుంచి సుమారు 150 బస్సులు నడుపుతామని ఆయా డిపొల అధికారులు పేర్కొన్నారు. బస్టాండ్ వద్ద తాత్కాలిక టాయిలెట్స్ సౌకర్యం పెంచాలని ఎంపీటీసీ వాసు కోరారు. ఉత్సవాల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత వహించాలని ఎంపీడీఓ ఎం.భాను ప్రకాష్, ఈఓపీఆర్డీ శ్రీహరిని, జేసీ ఆదేశించారు. ఎంపీపీ పప్పుల లక్ష్మి సరస్వతి, జెడ్పీటీసీ సభ్యురాలు రావి దుర్గ ఆలేంద్రమణి, సర్పంచ్‌లు పోతురాజు నాగేంద్రకుమార్, చొప్పల చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యుడు దొంగ నాగ సత్యనారాయణ, డివిజ¯ŒS వైద్యాధికారి పుష్కరరావు, రాజోలు సీఐ కృష్టాఫర్, ఎస్సైలు కృష్ణభగవాన్, విజయబాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.