next month
-
వచ్చే నెలలోనే కొత్త రూ.200నోట్లు
-
వచ్చే నెలలోనే కొత్త రూ.200నోట్లు
న్యూఢిల్లీ: చిల్లరకష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్రప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ఇండియా చర్యలకు దిగాయి. ప్రధనంగా పెద్ద నోట్ల రద్దు. ఆ తరువాత చలామణిలోకి వచ్చిన రూ. 2వేల నోటు కరెన్సీ లభ్యత గణనీయంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రూ. 200 నోటును అందుబాటులోకి తీసుకురానుంది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త నెలలోనే వీటిని విడుదల చేయనున్నట్లు సీనియర్ అధికారుల ద్వారా తెలుస్తోంది. మైసూర్‌లోని ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ రూ. 200 రూపాయల నోట్లను ఇప్పటికే ప్రింటింగ్ మొదలుపెట్టిందని, ముద్రణ ప్రక్రియ పూర్తి కావడానికి 21రోజులు పడుతుందని ప్రభుత్వ పెట్టుబడి, కరెన్సీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలోనే 200 రూపాయల నోట్లను ప్రవేశపెట్టాలన్న డెడ్ లైన్ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అత్యధిక భద్రతా ఫీచర్లతో వివిధ స్థాయిల్లో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుంది. ఆర్బీఐకు చెందిన భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని మైసూర్, సల్బోని నుండి వాటిని ఉత్పత్తి చేస్తున్నట్టు సమాచారం. ఎస్బీ నివేదిక ప్రకారం, బ్యాంకుల వద్ద కరెన్సీ సర్క్యులేషన్ 5.4 శాతానికి తగ్గింది. నోట్ల రద్దుకు ముందు ఇది 23.19శాతంగా ఉంది. దీంతో కొత్త నోట్లు ప్రవేశంతో డిమాండ్ , సరఫరా గ్యాప్ ను తగ్గించటానికి సహాయం చేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా చిల్లర కష్టాలను అధిగమించడానికి కొత్త రూ.200 నోటును తీసుకురావాలని మార్చి నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే నకిలీలను నిరోధించడానికి గాను కొత్త కరెన్సీలో అదనపు భద్రతా పొరను జోడించాలని ఆర్బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
వచ్చే నెల నుంచి కిరోసిన్ నిలిపివేత
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడి కోరుకొండ : వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కిరోసిన్‌ను సరఫరా నిలివేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలిన విజ్ఞప్తి చేశారు. కోరుకొండలోని సివిల్ సప్లయ్స్ గోడౌన్‌ను ఆయన, రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి కొల్లు రవీంద్రలు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ సరుకులను లబ్ధిదారులకు సక్రమంగా సరఫరా చేయకపోతే డీలర్లపై కఠిన చర్యలు తీసుకొంటామని, రేషన్ డీలర్లు తమ పనితీరును మార్చుకోవాలని, అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ షాపులను నిర్ణీత సమయాల్లో తెరచి ఉంచాలని, సరకుల తూకాలు సక్రమంగా ఉండాలని అన్నారు. గోడౌన్ నుంచి రేషన్ షాపులకు సరకులను తరలించే సమయంలో తరుగు వస్తే రవాణా చేసే వ్యక్తులనే బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీలపై రేషన్ షాపుల వద్ద ఒత్తిడి లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే వీవీ శివరామరాజు, జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎం ఎ.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణోత్సవాలు విజయవంతం చేద్దాం
సఖినేటిపల్లి (రాజోలు) : సమన్వయంతో శ్రీలక్షీ్మనృసింహస్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు విజయవంతం చేయాలని జేసీ ఎస్.సత్యనారాయణ అధికారులకు సూచించారు. ఫిబ్రవరి మూడు నుంచి 11 వరకు నిర్వహించనున్న శ్రీస్వామివారి కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై అంతర్వేది ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం జేసీ సమీక్షించారు. స్థానిక మంచినీటి చెరువు మరమ్మతులు పూర్తి చేసి, ఈ నెల 27లోగా నీటితో నింపాలని ఇరిగేష¯ŒS అధికారులను జేసీ అదేశించారు. దండుపుంత రోడ్డు గండ్లు పూడ్చాలని, పుణ్యక్షేత్రానికి తాగునీటి సమస్య లేకుండా చూడాలని, సముద్రస్నానాల రోజున సముద్రంలో రోప్ పార్టీని ఏర్పాటు చేయాలని పోలీసు, రెవెన్యూ శాఖలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు కోరారు. స్వామివారితో సముద్రం స్నానం చేసే ప్రముఖుల జాబితా, వారికి డ్రెస్‌కోడ్ ఇవ్వాలని అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్ ఆలయ అధికారులకు తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 70 మంది దేవాదాయ శాఖ సిబ్బందిని నియమిస్తున్నట్లు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ రమేష్‌బాబు, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ అప్పారావు, భక్తులకు మెరుగైన సేవలు అందజేస్తామని అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య తెలిపారు. బస్టాండ్, రాంబాగ్ వద్ద కిందికు వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని ఏపీ ట్రా¯Œ్సకో అధికారులకు తహసీల్దారు సుధాకర్ రాజు సూచించారు. 6, 7, 10 తేదీలలో తీర్థంలో మద్యం దుకాణాలు పూర్తిగా బంద్ చేస్తున్నామని అమలాపురం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటిండెంట్ అధికారి జయరాజు తెలపగా, ఉత్సవాల తొమ్మిది రోజులు తీర్థంలో మద్యం, మాంసం దుకాణాలు లేకుండా చూడాలని ఉత్సవ కమిటీ మాజీ చైర్మ¯ŒS భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, సర్పంచ్ భాస్కర్ల గణపతి జేసీని కోరారు. రాజోలు, అమలాపురం, నర్సాపురం, భీమవరం డిపొల నుంచి సుమారు 150 బస్సులు నడుపుతామని ఆయా డిపొల అధికారులు పేర్కొన్నారు. బస్టాండ్ వద్ద తాత్కాలిక టాయిలెట్స్ సౌకర్యం పెంచాలని ఎంపీటీసీ వాసు కోరారు. ఉత్సవాల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత వహించాలని ఎంపీడీఓ ఎం.భాను ప్రకాష్, ఈఓపీఆర్డీ శ్రీహరిని, జేసీ ఆదేశించారు. ఎంపీపీ పప్పుల లక్ష్మి సరస్వతి, జెడ్పీటీసీ సభ్యురాలు రావి దుర్గ ఆలేంద్రమణి, సర్పంచ్‌లు పోతురాజు నాగేంద్రకుమార్, చొప్పల చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యుడు దొంగ నాగ సత్యనారాయణ, డివిజ¯ŒS వైద్యాధికారి పుష్కరరావు, రాజోలు సీఐ కృష్టాఫర్, ఎస్సైలు కృష్ణభగవాన్, విజయబాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో సీఆర్సీ రాష్ట్రస్థాయి ఆహ్వాన కబడ్డీ
రావులపాలెం : సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్రస్థాయి ఆహ్వాన మె¯ŒS, ఉమె¯ŒS కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్సీ) అధ్యక్ష కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి తెలిపారు. రావులపాలెంలోని సీఆర్సీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు ఈ వివరాలను వెల్లడించారు. రావులపాలెం ప్రభుత్వ ఉభయ కళాశాలల మైదానంలో ఈ పోటీలు జనవరి 13 మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. మెన్, ఉమె¯ŒS విభాగాల్లో విజేతలకు రూ.2.50 లక్షల ప్రైజ్‌మనీ అందిస్తామన్నారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలు 15వ తేదీ రాత్రి ముగుస్తాయన్నారు. మె¯ŒS విభాగంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు; ఉమె¯ŒS విభాగంలో విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల జట్లు పోటీ పడతాయన్నారు. ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి వి.వీరలంకయ్య పర్యవేక్షణలో పోటీలు జరుగుతాయన్నారు. సీఆర్సీ స్పోర్ట్స్ డైరెక్టర్ నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, మంతెన రవిరాజు, చిర్ల కనికిరెడ్డి, ఆర్వీఎస్ రామాంజనేయరాజు, కుడుపూడి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
వచ్చే నెల 3న మెగా రక్తదాన శిబిరం
మోత్కూరు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా ఫెడరేషన మోత్కూరు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 3న మోత్కూరులోని శ్రీలక్ష్మీ ఫెట్రోల్ బంక్ ఆవరణలో మెగా రక్తశిబిరం నిర్వహిస్తున్నట్టు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మెతుకు సైదులు తెలిపారు. సోమవారం కార్యక్రమ కరపత్రాలను మండలకేంద్రంలో వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సోమేశ్వర్, తొర్ర ఉప్పలయ్య, సుబ్రహ్మణ శర్మ, దొర్న వెంకన్న, మోత్కూరు రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు చింతల సత్యనారాయణరెడ్డి, సభ్యులు అనిల్, సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఉపాధ్యాయులకు త్వరలో జీతాలు
రంపచోడవరం : డీఈఓ పూల్ ద్వారా 2014 డీఎస్సీలో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు త్వరలో జీతాలు విడుదలవుతాయని డీఈఓ ఆర్.నరసింహరావు తెలిపారు. పాఠశాలల్లో రసాయన రహిత పోషక విలువలతో కూడిన కూరగాయల పెంపకంపై మండల రీసోర్స్ సెంటర్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు శనివారం ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2014 డీఎస్సీలో ఎంపికైన 200 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ ప్లేస్ లేకపోవడంతో జీతాల విడుదలకు సంబంధించి ఇబ్బంది ఉందని అన్నారు. వచ్చే నెలలో జీతాలు విడుదల చేస్తామన్నారు. జిల్లాలోని 400 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు అవకాశం ఉందన్నారు. అయితే నిధుల కొరతతో కంప్యూటర్ బోధకులను నియమించకపోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడం లేదన్నారు. జిల్లా పరిషత్ నుంచి నిధులిస్తే ఔట్సోర్సింగ్ ద్వారా కంప్యూటర్ విద్యాబోధన సాధ్యమవుతుందన్నారు. పాఠశాలల వాచ్‌మన్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో నిధులు సమకూర్చుకుని వాచ్‌మన్‌ను నియమించుకోవాలని ఆయన సూచించారు. -
ఇక వజ్రాల వేట షురూ..
న్యూఢిల్లీ: దేశంలో మొదటి సారి వజ్రాల గనుల తవ్వకాల కోసం ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో విరివిగా వున్న వజ్రాల గనులకు వేలం పాటల్ని వచ్చే నెలలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చేవారం టెండర్లను ఆహ్వానిస్తూ నోటీసులు ఇవ్వనున్నట్టు మైన్స్ సెక్రటరీ బల్విందర్ కుమార్ పీటీఐకి తెలిపారు. ఫిబ్రవరిలో మొదటి సారి బంగారు గనులకు వేలం నిర్వహించిన ప్రభుత్వం ఇపుడు వజ్రాల అన్వేషణ కోసం నడుం బిగిస్తోంది. ఈ గనుల లీజు ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేవారం నోటీసులు ఇస్తుందని బల్విందర్ కుమార్ తెలిపారు. సుమారు మూడువారాలలో టెండర్ల పరిశీలన పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి మాత్రమే మైనింగ్ నిర్వహిస్తోందని తెలిపారు. దేశంలో ఇది ఏటా 81,000 క్యారెట్ల పైగా ఉత్పత్తి చేస్తోందన్నారు. దీంతోపాటుగా పన్నా, శాంతా జిల్లాలో 400 క్యారెట్ల షాలో డైమండ్స్ ను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. మధ్యప్రదేశ్ లో 10,45,000 క్యారెట్ల వజ్రాల నిధులు ఉండగా, పన్నా 976,05 వేల క్యారెట్లవరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశలో మొత్తం 42 గనులను గుర్తించినట్టు తెలిపారు. ఇనుప ఖనిజం, బాక్సైట్, బంగారు, సున్నపురాయి నిక్షేపాలతో ఇవి నిండివున్నాయన్నారు. వీటిలో ఆరు గనుల విజయవంతంగా వేలం వేశారు. -
వచ్చే నెల 8 నుంచి భారత్‌లోకి ఐఫోన్ ఎస్ఈ
ధర రూ.39,000 నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ తన తాజా ఐఫోన్ మోడల్ ఐఫోన్ ఎస్ఈ ను వచ్చే నెల 8 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. 16 జీబీ, 64 జీబీ మోడళ్లలో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.39,000ల నుంచి బీటెల్ టెలిటెక్, రెడింగ్టన్ కంపెనీలు విక్రయించనున్నాయి. భారత్, చైనా దేశాల్లో విక్రయాలు పెంచుకోవడం లక్ష్యాలుగా యాపిల్ కంపెనీ ఈసారి తక్కువ ధరలో చిన్నదైన ఐఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్లో లభ్యమవుతున్న కొన్ని ఐఫోన్ మోడళ్ల కంటే ఈ కొత్త ఐఫోన్ ధర భారత్‌లో అధికంగా ఉంది. ఈ కొత్త ఐఫోన్లో నాలుగు అంగుళాల స్క్రీన్, వేగవంతమైన ఏ9 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 12 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా, లైవ్ ఫొటోస్, వేగవంతమైన వెర్లైస్ వంటి ఫీచర్లున్నాయి. ఈ కొత్త ఐఫోన్‌ను 3,000 రిటైల్ అవుట్లెట్లలో అందిస్తామని రెడింగ్టన్, 3,500 అవుట్‌లెట్లలలో అందిస్తామని బీటెల్ టెలిటెక్‌లు తెలిపాయి. ఈ నెల 29 నుంచి ముందస్తు ఆర్డర్లు తీసుకుంటామని ఈ రెండు సంస్థలు వెల్లడించాయి. -
వచ్చే నెలలో వ్యోమనౌక ప్రయోగం
మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేలా రూపకల్పన: ఇస్రో న్యూఢిల్లీ: అంతరిక్షంలోకి ఉపగ్రహాలను మళ్లీ మళ్లీ ప్రయోగించేందుకు వీలయ్యే పునర్వినియోగ వాహక నౌక (వ్యోమనౌక)ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. ప్రస్తుతం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి రాకెట్లను ఇస్రో వినియోగిస్తోంది. ఇవి కేవలం ఒకేసారి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి భూమిని చేరి, మళ్లీ వినియోగించుకోగలిగే వ్యోమనౌకలను వినియోగిస్తే భారీ స్థాయిలో వ్యయం ఆదా అవుతుంది. ఇప్పటికే అమెరికా, రష్యాలు ఇలాంటి వ్యోమనౌకలను వినియోగిస్తున్నాయి. దీంతో ఆ తరహా వ్యోమనౌకలను అభివృద్ధి చేయడంపై ఇస్రో దృష్టిపెట్టింది. వచ్చే నెలలో ప్రయోగాత్మక పరీక్షను జరపనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వెల్లడించారు. ‘‘వ్యోమనౌకను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఎన్నో దశలను అధిగమించాల్సి ఉంది. మొదట దీనిని సముద్రంలో ల్యాండ్ చేయనున్నాం. అంతిమంగా శ్రీహరికోటలోని రన్‌వేపై వ్యోమనౌక ల్యాండ్ అయ్యేలా అభివృద్ధి చేస్తాం. ఈ పునర్వినియోగ వ్యోమనౌక వల్ల అంతరిక్ష ప్రయోగాల వ్యయం దాదాపు పదోవంతు తగ్గుతుంది..’’ అని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా అంతరిక్ష శాస్త్ర పరిశోధనల నిమిత్తం తొలిసారిగా ‘ఆస్ట్రోశాట్’ ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. మార్స్ ఆర్బిటార్ మిషన్ నుంచి చిత్రాలను అందుకున్నామని వాటిని పరిశీలించిన అనంతరం విడుదల చేస్తామని చెప్పారు. కాగా ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ కూడా పాల్గొని ప్రసంగించారు. గత ఏడాది ఇస్రో 11 ఉపగ్రహాలను ప్రయోగించిందని చెప్పారు. ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌లో భాగంగా వచ్చే ఏడాది మూడు ఉపగ్రహాలను, ఆ తర్వాత ఏడాది రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు తెలిపారు. -
పెరిగిన వేతనాల కోసం నిరీక్షించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణద్వారా పెరిగిన వేతనాలు అందాలంటే మరో నెల వేచి చూడాల్సిందే. పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నిర్ణయం మేరకు మార్చి వరకు పెరిగిన పీఆర్సీ వేతనాల్ని బకాయిల రూపంలోను, ఏప్రిల్ నుంచి నగదు రూపంలో మే 1న ఉద్యోగులు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి బుధవారం సమావేశమవుతోంది. ఉద్యోగుల పీఆర్సీ అమలు, బకాయిలు చెల్లింపుపై ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి రానుంది. కేబినెట్ నిర్ణయం మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులిస్తుంది. ఏ ఉద్యోగికి ఎంత వేతనం పెరుగుతుందనే లెక్క అప్పుడు తేలుతుంది. మే ఒకటో తేదీ వేతనంతో పెరిగిన వేతనాల చెల్లింపు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో పెరిగిన వేతనాల్నికూడా జూన్ ఒకటిన చెల్లించే వేతనంతో కలిపి నగదు రూపంలో అందించనున్నారు. -
వచ్చే నెల ప్రధాని విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 9 నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 9 నుంచి 16 వరకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో మోదీ పర్యటించి ఆయా దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. ఎనిమిది రోజులపాటు సాగే ఈ పర్యటనలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ద్వైపాక్షిక సంబంధాలు బలపరచుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం వంటి అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. తొలుత ఏప్రిల్ 9 నుంచి ఫ్రాన్స్‌లో, 12 నుంచి జర్మనీలో, 14 నుంచి కెనడాల్లో మోదీ పర్యటన సాగుతుంది. ఇందులో భాగంగా జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో, కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్‌లతో మోదీ సమావేశమవుతారు. -
ఉక్కు ధరల పెంపు!
న్యూఢిల్లీ: ఉక్కు కంపెనీలు ఉక్కు ఉత్పత్తుల ధరలను పెంచాలని యోచిస్తున్నాయి. టన్నుకు రూ. 1,000 చొప్పున వచ్చే నెల నుంచే ధరలు పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాల సమాచారం. ఇనుప ఖనిజం ధరలు, రవాణా వ్యయాలు, ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటంతో ధరలు పెంచక తప్పదనేది కంపెనీల వాదన. హాట్ రోల్డ్ కాయిల్(హెచ్ఆర్సీ) ఉత్పత్తుల ధరలు ప్రస్తుతమున్న రూ. 37,500ల స్థాయి నుంచి రూ. 38,500కు (టన్నుకు) పెరగవచ్చు. సెయిల్, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ తదితర ఉక్కు కంపెనీలు ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ధరలను టన్నుకు రూ. 2,500 చొప్పున పెంచాయి. ఆ తర్వాత ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను పెంచింది. ఇక రైల్వేలు కూడా టన్నుకు రూ. 100 చొప్పున రవాణా వ్యయాన్ని పెంచాయి. ఈ రెండు కారణాల వల్ల టన్ను ఉక్కు వ్యయం రూ. 700 వరకూ పెరుగుతుందని ఒక ప్రైవేట్ ఉక్కు కంపెనీ అధికారి పేర్కొన్నారు. అయితే మార్కెట్ మందగమనంలో ఉండడం, నిర్మాణ, వాహన, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఉక్కు కంపెనీలు ధరలను పెంచడానికి సాహసించలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా ఉక్కు ధరలు కూడా పెరుగుతున్నాయి.