కల్తీ బీర్లంటూ వైన్స్ ఎదుట ఆందోళన
► రూ.110కి విక్రయించాల్సిన బీరు రూ.60కే
► బీరు రుచిగా లేదనే అనుమానంతో..
► శేరిగూడ ఆంజనేయ వైన్స్ వద్ద ఘటన
ఇబ్రహీంపట్నంరూరల్: కల్తీ బీర్లు అమ్ముతున్నరంటూ మద్యం దుకాణం ముందు పలువురు ఆందోళన చేశారు. బీరు ధర రూ.110 ఉండగా.. లెబుల్స్ మార్చి రూ.60కే 650ఎంఎల్ బీరును విక్రయించారు. దీంతో బీరు సేవిస్తుండగా లెబుల్స్ కవర్ ఉడిపోవడంతో అనుమానం వచ్చిన కొందరు యువకులు మద్యం దుకాణ యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సంఘటన ఆదివారం శేరిగూడ శ్రీఆంజనేయ వైన్స్ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన కొందరు యువకులు రెండు కాటన్ల హైవర్డ్స్ 5000 బీర్లు కొనుగోలు చేశారు.
సమీపంలోని బహిరంగ ప్రదేశంలో సేవిస్తుండగా బీరుపై గల లేబుల్స్ ఉడిపోయింది. లేబుల్‌ను పరిశీలించగా దానిపై ఎమ్మార్పీ ధర రూ.60గా ఉంది. అదేవిధంగా సేవించిన బీరు రుచికరంగా లేకపోవడంతో అనుమానంతో ఆ యువకులు వైన్స్ వద్దకు వచ్చి కల్తీ బీర్లంటూ ప్రశ్నించారు. దీంతో వైన్స్ యాజమాన్యం ఏమీ కాదులేండీ అంటూ దాటవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని లేబుల్స్ పరిశీలించి పరీక్షలు నిర్వహిస్తామంటూ ఆ మద్యాన్ని తీసుకొని వెళ్లిపోయారు. ఇంత జరిగిన ఎక్సైజ్ అధికారులు రాకపోవడంతో పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఆంజనేయ వైన్స్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నరని ఆరోపించారు.