
'ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి'
విజయవాడ: నేటి తరం కుటుంబ నియంత్రణ పద్ధతులను పక్కన పెట్టి.. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో శనివారం క్రీడా అవగాహణ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన కుటుంబ నియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా జనాభా సంఖ్య తగ్గుతోందని... రాష్ట్రంలో కూడా జనాభా పెరగాల్సిన అవసరముందన్నారు. కుటుంబ నియంత్రణను పద్ధతులను పక్కనపెట్టి పిల్లలను కనాలని బాబు చెప్పారు. స్కూల్ స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జూన్ నాటికి క్రీడలపై అవగాహన క్యాలెండర్ రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు.
రెండు నెలల కిందట చంద్రబాబు కాపు రుణమేళా సభలో మాట్లాడుతూ... రాష్ట్రంలో జనన మరణాల రేటు సమానంగా ఉంది. దీంతో రాబోయే కాలంలో యువత సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని.. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు చెప్పారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి సంతరించుకున్నాయి.