జేఎన్‌టీయూ: ఏపీ పీజీ ఈసెట్–2017కి సంబంధించి కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ విజయకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జేఎన్‌టీయూ అనంతపురంలోని పాలక భవనంలో ఈనెల 27, 28 తేదీల్లో జీ–ప్యాట్, గేట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకూ ఏపీ పీజీ ఈసెట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామన్నారు. ప్రత్యేక కేటగిరి వారు కూడా జేఎన్‌టీయూ అనంతపురంలోనే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు.