
రబ్బరు రోడ్డు (ఫైల్)
అనంతపురం విద్య: సహజ రబ్బరుతో రహదారుల నిర్మాణానికి సంబంధించి విస్తృత పరిశోధనలకు జేఎన్‌టీయూ(ఏ) వేదిక కానుంది. ఈ క్రమంలో వర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రహదారులు, రోడ్ల నిర్మాణాల్లో నూతన అంశాలపై పరిశోధనల ప్రక్రియ మొదలైంది. రబ్బరును వినియోగించే అంశంపై పరిశోధనలకు జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్ కళాశాలలో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఇందుకు భారత రహదారుల మంత్రిత్వశాఖ అండగా నిలుస్తూ వచ్చే నాలుగేళ్ల కాలానికి రూ.1,75,23,000 మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు మెంటార్‌గా జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పీఆర్ భానుమూర్తి వ్యవహరించనున్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ దక్కడంపై వర్సిటీ వీసీ జింకా రంగజనార్దన, రిజిస్ట్రార్ సి.శశిధర్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment