‘గవర్నర్‌ గారూ.. మన్నించండి’ | JNTUA in charge VC who removed the plaque | Sakshi
Sakshi News home page

‘గవర్నర్‌ గారూ.. మన్నించండి’

Published Sun, Jul 28 2024 5:23 AM | Last Updated on Sun, Jul 28 2024 5:23 AM

JNTUA in charge VC who removed the plaque

చాన్సలర్‌ హోదాలో ఆయన ప్రారంభించిన శిలాఫలకాన్ని తొలగించిన జేఎన్‌టీయూఏ ఇన్‌చార్జ్‌ వీసీ 

ఆ స్థానంలో చంద్రబాబు శిలాఫలకం ఏర్పాటు  

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్‌ హెచ్‌.సుదర్శనరావు స్వామిభక్తిని ప్రదర్శించారు. జేఎన్‌టీయూఏ నూతన పాలక భవనాన్ని జనవరి 6న రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ చాన్సలర్‌ హోదాలో ప్రారంభించారు. వర్సిటీలో స్నాతకోత్సవానికి హాజరైన  సందర్భంగా ఆయన నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని భవనం ముందు ఏర్పాటు చేశారు. 

కాగా.. 2017లో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా పరిపాలన భవనం, లెక్చర్‌ హాల్‌ కాంప్లెక్స్, ఫార్మసీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకం వర్సిటీ క్యాంపస్‌లో అప్పట్లో ఏర్పాటు చేశారు. తాజాగా నూతన పాలక భవనాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. 

వర్సిటీ చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ వచ్చి భవనాన్ని ప్రారంభిస్తే.. ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్‌ హెచ్‌.సుదర్శనరావు ఆ శిలాఫలకాన్ని తొలగించి, సీఎం చంద్రబాబు 2017లో వర్చువల్‌గా భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని మీడియాకు సైతం తెలిపారు. రాష్ట్రంలోనే అత్యున్నత హోదా కలిగిన గవర్నర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా? వర్సిటీ చాన్సలర్‌ అంటే ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్‌కు లెక్కలేదా? అని పలువురు విస్మయం వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement