Sudarshan Rao
-
‘గవర్నర్ గారూ.. మన్నించండి’
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ హెచ్.సుదర్శనరావు స్వామిభక్తిని ప్రదర్శించారు. జేఎన్టీయూఏ నూతన పాలక భవనాన్ని జనవరి 6న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో ప్రారంభించారు. వర్సిటీలో స్నాతకోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని భవనం ముందు ఏర్పాటు చేశారు. కాగా.. 2017లో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా పరిపాలన భవనం, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, ఫార్మసీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకం వర్సిటీ క్యాంపస్‌లో అప్పట్లో ఏర్పాటు చేశారు. తాజాగా నూతన పాలక భవనాన్ని గవర్నర్ ప్రారంభించారు. వర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ వచ్చి భవనాన్ని ప్రారంభిస్తే.. ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ హెచ్.సుదర్శనరావు ఆ శిలాఫలకాన్ని తొలగించి, సీఎం చంద్రబాబు 2017లో వర్చువల్‌గా భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని మీడియాకు సైతం తెలిపారు. రాష్ట్రంలోనే అత్యున్నత హోదా కలిగిన గవర్నర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా? వర్సిటీ చాన్సలర్ అంటే ఇన్చార్జ్ వైస్ చాన్సలర్‌కు లెక్కలేదా? అని పలువురు విస్మయం వ్యక్తం చేశారు. -
వృద్ధాప్యంలో కీలక సమస్య ‘ఫాల్’
డాక్టర్ సలహా ఇటీవల పెద్దవయసు వారు బాత్‌రూమ్‌ల్లోనూ, మెట్ల దగ్గర పడిపోతున్న ఉదంతాలను ఎక్కువగా చదువుతున్నాం. ఇలా పడిపోయే అవకాశాలను ముందుగా తెలుసుకునే పరీక్షలు ఏమైనా ఉన్నాయా? - సీహెచ్. సుదర్శన్‌రావు, మహబూబ్‌నగర్ ఫాల్ అంటే పడిపోవడం. వృద్ధుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. చిన్నవయసు వారు పడిపోయి, ఫ్రాక్చర్ అయినా వారు కోలుకునే వ్యవధి తక్కువ. ఎముక అతుక్కునే తీరు కూడా వేగంగా జరుగుతుంది. కానీ పెద్దవారు పడిపోయి, ఎముక ఫ్రాక్చర్ అయితే అది మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే తాము పడిపోయే అవకాశాన్ని వృద్ధులు తమకు తామే పరీక్షించుకోవచ్చు. ముందుగా మీ కుడి చేతిని గోడకు ఆనించి నిలబడండి. దాన్ని గోడకు ఆనించి ఉంచే పిడికిలి బిగించి నేరుగా ముందుకు చాపండి. ఇలా కుడి చేతిని నిటారుగా ఉంచి ముందుకు కొద్దికొద్దిగా ఒంగుతూ... పడిపోకుండా గరిష్టంగా ఎంతమేరకు ఒంగగలరో చూడండి. ముందుకు ఒంగకుండా కేవలం కుడి చేయి చాచి ఉన్నప్పుడూ.... పడిపోకుండా ముందుకు ఒంగుతూ చాచిన చేతిని పొడిగించినప్పుడూ ఉన్న తేడా ఒక అడుగు (30 సెం.మీ.) ఉంటే అలాంటి వృద్ధుల్లో ‘ఫాల్’కు (పడిపోవడానికి) అవకాశం చాలా తక్కువ. అయితే ఒకవేళ ఇలా ఒంగుతూ చేతిని సాచినప్పుడు మీరు మీ చేతిని కేవలం 30 సెం.మీ లోపే సాచగలుగుతుంటే మాత్రం బాత్రూమ్లోనో లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడో లేదా ఇతరత్రా కార్యకలాపాల్లో పడిపోయే అవకాశాలు ఎక్కువ అని గుర్తించండి. ఇలాంటి వాళ్లు నడిచేసమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఇతరుల సహాయం తీసుకోవాలి. - డాక్టర్ బి. విజయకుమార్, సీనియర్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్ -
ఐటీసీకి భూముల కేటాయింపు రద్దు చేయాలి
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: ఐటీసీ విస్తరణ కోసం బూర్గంపాడు మండలంలో 1/70 చట్టానికి విరుద్ధంగా చేసిన భూ కేటాయింపులను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం సుంవరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ పరిశ్రమ నెలకొల్పాలని కోరారు. భూముల కేటాయింపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకుంటే ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీసీకి 837 ఎకరాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గతంలో ఇచ్చిన భూమి కంటే ఐటీసీ అదనంగా భూమి కబ్జాచేసి వినిమోగించుకుంటోందని ఆరోపించారు. కనీసం పంచాయతీకి పన్ను కూడా చెల్లించడం లేదన్నారు. ఒప్పందం ప్రకారం స్థానికులకు, గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని చెప్పారు. 1500 మంది కార్మికులుంటే అందులో గిరిజనులు 1 శాతం కుడా లేరన్నారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారికి కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం అమలు చేయాలని కోరితే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఐటీసీ నుంచి వెలువడే కాలుష్యంతో బూర్గంపాడు, కుక్కునూరు, భద్రాచలం మండలాల్లో అత్యధిక మంది మహిళలు గర్భకోశ, క్యాన్సర్ వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పారు. కాలుష్య నివారణ విషయంలో ఐటీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.