కర్నూలు(రాజ్‌విహార్): జెరూసలెం యాత్రకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అంజాద్ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజుల ఈ యాత్రకు అర్హత కలిగిన వారికి రూ.40వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. వివరాలకు ఫోన్ 98488 64449, 08518 277153 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.