మహబూబాబాద్ : డీసీహెచ్‌ఎస్, డీఎంఅండ్‌హెచ్‌ఓ కో ఆర్డినేషŒS కోసం డీహెచ్‌ఓ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కార్యాలయం ఏరియా ఆసుపత్రిలోని క్వార్టర్స్‌లోనే ఉండేలా పనులు ముమ్మరం చేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏడు క్వార్టర్లు ఉన్నాయి. ఒక క్వార్టను మూడు రోజుల క్రితం ఖాళీ చేయించారు. మానుకోట జిల్లాకు డీహెచ్‌ఓను నియమిస్తారని, ఏరియా ఆసుపత్రిలోని సివిల్ సర్జ¯ŒS లేక సివిల్ అసిస్టెంట్ సర్జ¯ŒSలో సీనియారిటీని బట్టి ఆ పోస్టుకు నియమించే అవకాశం ఉందని సమాచారం. మానుకోట ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జ¯ŒS సీనియర్ వైద్యులు ఉన్నారు. ఆయనకే డీహెచ్‌ఓగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. డీసీహెచ్‌ఎస్ పరిధిలో మానుకోట ఏరియా ఆస్పత్రి, గూడూరులోని సివిల్ ఆస్పత్రి ఉంటాయి. డీఎంఅండ్‌హెచ్‌ఓ పరిధిలో 16 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఆ రెండింటిని కో ఆర్డినేష¯ŒS చేసేలా డీహెచ్‌ఓను నియమించనున్నారు.జిల్లా వైద్య విధాన పరిషత్‌లో ఉన్న ఆసుపత్రులు, డీఎంఅండ్‌హెచ్‌ఓ పరిధిలో ఉన్న ఆసుపత్రులను కలిపి ఒకే విభాగంగా చేసి వీటికి జిల్లా అధికారిగా డీహెచ్‌ఓకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మానుకోట ఏరియా ఆసుపత్రి 100 పడకలకే పరిమితమైంది. మానుకోట డివిజ¯ŒSతో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల నుంచి రోజుకు 700–800 మంది రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. అయితే సీటీ స్కా¯ŒS, బ్లడ్ బ్యాంక్, రేడియాలజిస్ట్, నేత్ర వైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ పాడై నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లా ఏర్పాౖటెతే అయినా ఈ సమస్యలు గట్టెక్కుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.