ఆర్ట్ టచింగ్
ఆర్ట్ టచింగ్
Published Fri, Sep 2 2016 5:19 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
మల్కాపురం : బొమ్మ గీస్తే అచ్చుగుద్దినట్టు ఉండాలి. జీవకళ ఉట్టిపడాలి. పోలికల్లో ఏ మాత్రం తేడా రాకూడదు. ఇదే లక్ష్యంతో ఆ బాలిక భళా అనిపించుకుంటుంది. అద్భుత చిత్రాలతో జాతీయస్థాయిలో రాణిస్తోంది. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన అన్వేష అద్భుత ప్రతిభతో సత్తా చాటుతోంది. జింక్ ప్రాంతంలోని ఎస్‌ఆర్ డీజీ పాఠశాల్లో అన్వేషిత తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆరో తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల స్థాయి పెయింటింగ్ పోటీల్లో మహాత్మాగాంధీ చిత్రానికి ప్రశంసలు అందుకుంది. దీంతో చిత్రలేఖనంపై దష్టి సారించింది. ప్రముఖ చిత్రకారుడు చెల్లూరు భాస్కరరావు వద్ద శిక్షణ పొందుతోంది. తల్లిదండ్రులు,గురువు ప్రోత్సాహంతో జిల్లా,రాష్ట్ర స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని సుమారు వందకు పైగా సిల్వర్,బ్రాంజ్ మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లు అందుకుంది.
జాతీయ పోటీలో...
ఇటీవల నెల్లూరు,తెనాలి,విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీల్లో అన్వేషిత పాల్గొని బంగారు పతకాలు సాధించింది. ఈ ఏడాది సంక్రాంతిని సందర్భంగా విజయవాడలో జరిగిన జాతీయ స్థాయిపోటీలలో అన్వేషిత కు బంగారు పతకంతో పాటు ప్రోత్సాహక బహుమతి,సర్టిఫికెట్లు అందుకుంది. మరిన్ని చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని భావిస్తున్నట్టు అన్వేషిత చెబుతోంది.
Advertisement
Advertisement