Anvesha Vij: 'OMG'.. ఫీచర్ ఫిల్మ్‌తో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసి..
అన్వేషా విజ్.. ఓటీటీ వీక్షకులను ఆకట్టుకుంటున్న నటి. గ్లామర్ ఫీల్డ్‌లోకి రాకముందే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్. అందుకే ఆమెను డాన్సర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్ట్రెస్ అని పరిచయం చేయాలి!అన్వేషా పుట్టిపెరిగింది ఢిల్లీలో. తండ్రి.. అమిత్ విజ్, ఆర్కిటెక్చరల్ డిజైనర్. తల్లి.. మధు విజ్, గృహిణి. ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన అన్వేషాకు డాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పుడే డాన్స్‌లో ట్రైనింగ్ మొదలుపెట్టింది.2014లోనే సోషల్ మీడియాలోకి ఎంటర్ అయింది తన పేరు మీదే ఓ యూట్యూబ్ చానెల్ పెట్టి. కాని పెద్దగా యాక్టివ్‌గా లేకుండింది. 2020లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసింది. అందులో చాలా యాక్టివ్‌గా ఉంది తన డాన్స్ వీడియోలు, ఫొటోస్‌తో! ఆ పోస్ట్‌లకు అనతికాలంలో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగి అన్వేషాను ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేర్చారు. స్ట్రాంగ్ ఫ్యాన్బేస్గా ఏర్పడ్డారు.ఆ పాపులారిటినే ఆమెకు లాక్మే, బీ రియల్ లాంటి బ్రాండ్స్‌కి మోడలింగ్ చేసిపెట్టే చాన్స్‌నిచ్చింది. మోడలింగేమో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద అడుగుపెట్టే అవకాశాన్నిచ్చింది.ఓటీటీలో ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ‘క్రాష్ కోర్స్’. అందులో నిక్కీ కపూర్ పాత్రతో ఓటీటీ వీక్షకులను మెప్పించింది. ఆ మరుసటి ఏడు అంటే 2013లో OMG 2 (ఓహ్ మై గాడ్ 2) ఫీచర్ ఫిల్మ్‌తో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసి సినీ అభిమానులను మురిపించింది. పరేశ్ రావల్ నటించిన OMG (ఓహ్ మై గాడ్)కి సీక్వెల్ అయిన ఈ సినిమాలో ఆమె పంకజ్ త్రిపాఠీకి కూతురు ‘దమయంతి’గా నటించింది. అది ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.ప్రముఖ స్టాండప్ కమేడియన్ మునవ్వర్ ఫారూకీతో కలసి ‘కాజల్’ అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించింది. తాజాగా అన్వేషా ‘సిస్టర్హుడ్’ అనే సిరీస్‌తో అలరిస్తోంది. ఇది మినీ టీవీలో స్ట్రీమ్ అవుతోంది."ఓటీటీ అండ్ సినిమా రెండూ దేనికవే డిఫరెంట్. ఈ రెండిటితో చాలా నేర్చుకుంటున్నాను. ముఖ్యంగా 'OMG2’ సినిమాలో నా సీనియర్ కోస్టార్స్ పంకజ్ సర్, యామీ గౌతమ్ మామ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. వాళ్లు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు". – అన్వేషా విజ్ఇవి చదవండి: రాగాలాపనలో...