దేశంలో అతిపెద్ద ఫోర్స్‌గా సీఆర్‌పీఎఫ్
కలికిరి : దేశంలోనే అతిపెద్ద పారా మిలటరీ ఫోర్స్‌గా కేంద్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ సీఆర్‌పీఎఫ్ పనిచేస్తోందని డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ పాళ్యెంకొండలో విలేకరులతో మా ట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ విస్తరించిందని వివరిం చారు. ప్రకృతి వైపరీత్యాల్లో సాహసోపేతంగా పనిచేస్తూ సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత స్థావరాలో్లకి చొరబడి వాటిని ధ్వంసం అణచివేశామన్నారు. కాశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లను చక్కదిద్దడంలో సీఆర్‌పీఎఫ్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పారు. కలికిరి సీఆర్‌పీఎఫ్ కేంద్రాన్ని 450 ఎకరాల్లో ఏర్పాటు చేశామని, 34 తాత్కాలిక షెడ్‌లు ఏర్పాటు చేసి ఉగ్రవాద నిరోధక శిక్షణ పాఠశాల–3 ప్రారంభించామని తెలి పారు.
ఏడాదికి మూడు బ్యాచ్‌లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. దేశంలోనే మొదటి మూడు శిక్షణ పాఠశాలలో కలికిరి ఒకటని పేర్కొన్నారు. సీయట్, శివపురి ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జనార్దన్ గౌడ్, సీఆర్‌పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ అభిషేక్ మహంతి, సీఆర్‌పీఎఫ్ ఐజీ గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీఆర్‌పీఎఫ్ శిక్షణ కేంద్రం ప్రారంభం
కలికిరి సమీపంలోని పాళ్యెం కొండ వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) శిక్షణ కేంద్రాన్ని డైరెక్టర్ జనరల్ కె.దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. శుక్రవారం విచ్చేసిన ఆయనకు ఐజీ గిరిప్రసాద్, జిల్లా అడిషనల్ ఎస్పీ అభిషేక్ మహంతి, మదనపపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సైనిక పాఠశాల వింగ్‌కమాండర్ వీఎస్. డంగ్వాల్ స్వాగతం పలికారు.