Paramilitary force
-
ధోని కొత్త ఇన్నింగ్స్ షురూ!
శ్రీనగర్ : పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకుగాను రెండు నెలలపాటు సెలవు తీసుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ప్రస్తుతం క్యాంపులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. సైన్యంతో కలిసి విధులు నిర్వర్తించేందుకు వెస్టిండీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధోని ప్రస్తుతం భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి కాశ్మీర్ లోయలో రెండు నెలలపాటు సైన్యంతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగా ఉగ్రదాడులు ఎదుర్కొనే విక్టర్ ఫోర్స్ విభాగంలో సైనాధికారులు ధోనికి బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ధోని ఉన్నతాధికారులతో కలిసి క్యాంపులో పాల్గొంటూ, సైనికులలో ఒకరికి బ్యాట్ మీద ఆటోగ్రాఫ్ చేస్తోన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 2011లో కల్నల్ హోదా పొందిన ధోని, అనంతరం పారా మిలటరీ రెజిమెంట్‌లో పని చేయడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ భారత పౌరుడు మిలటరీ యూనిఫామ్ ధరించాలనుకున్నప్పుడు అతనికి కేటాయించిన ఏ విధులనైనా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ధోని ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారని, క్రికెట్లో నిర్వర్తించిన విధంగానే ఇక్కడ కూడా తన విధులను బాధ్యాతయుతంగా నిర్వర్తిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. -
దేశంలో అతిపెద్ద ఫోర్స్‌గా సీఆర్పీఎఫ్
కలికిరి : దేశంలోనే అతిపెద్ద పారా మిలటరీ ఫోర్స్‌గా కేంద్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ సీఆర్పీఎఫ్ పనిచేస్తోందని డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ పాళ్యెంకొండలో విలేకరులతో మా ట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సీఆర్పీఎఫ్ విస్తరించిందని వివరిం చారు. ప్రకృతి వైపరీత్యాల్లో సాహసోపేతంగా పనిచేస్తూ సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత స్థావరాలో్లకి చొరబడి వాటిని ధ్వంసం అణచివేశామన్నారు. కాశ్మీర్లో చెలరేగిన అల్లర్లను చక్కదిద్దడంలో సీఆర్పీఎఫ్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పారు. కలికిరి సీఆర్పీఎఫ్ కేంద్రాన్ని 450 ఎకరాల్లో ఏర్పాటు చేశామని, 34 తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి ఉగ్రవాద నిరోధక శిక్షణ పాఠశాల–3 ప్రారంభించామని తెలి పారు. ఏడాదికి మూడు బ్యాచ్‌లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. దేశంలోనే మొదటి మూడు శిక్షణ పాఠశాలలో కలికిరి ఒకటని పేర్కొన్నారు. సీయట్, శివపురి ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్ఐ పురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జనార్దన్ గౌడ్, సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ అభిషేక్ మహంతి, సీఆర్పీఎఫ్ ఐజీ గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రం ప్రారంభం కలికిరి సమీపంలోని పాళ్యెం కొండ వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) శిక్షణ కేంద్రాన్ని డైరెక్టర్ జనరల్ కె.దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. శుక్రవారం విచ్చేసిన ఆయనకు ఐజీ గిరిప్రసాద్, జిల్లా అడిషనల్ ఎస్పీ అభిషేక్ మహంతి, మదనపపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సైనిక పాఠశాల వింగ్‌కమాండర్ వీఎస్. డంగ్వాల్ స్వాగతం పలికారు. -
సీమాంధ్రకు 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు
హైదరాబాద్: తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా చూసేందుకు అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 45 కంపెనీల పారామిలటరీ బలగాలు ఉన్నాయి. అదనంగా 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు కావాలని కేంద్రాన్ని కోరింది. కోయంబత్తూరు నుంచి 15, కోల్‌కతా నుంచి 10 పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం అదనపు బలగాలు కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఇన్చార్జి డీజీపీ ప్రసాదరావు తెలిపారు. సీమాంధ్ర నాయకులకు అవసరమయితే భద్రత పెంచుతామన్నారు. సమైక్య ఉద్యమకారులు కేంద్ర కార్యాలయాలు టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. ఈ మధ్యాహ్నం శాంతి భద్రతలపై సీఎం కిరణ్ సమీక్ష నిర్వహించారు. ఉద్యమకారులపై ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా ప్రయోగించడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు.