వర్సిటీ రెక్టార్ జి.శ్రీధర్, రిజిస్ట్రార్ ఏ.వెంకటరమణ పదవీ కాలం మంగళవారంతో ముగిసింది.
ఎస్కేయూ : వర్సిటీ రెక్టార్ జి.శ్రీధర్, రిజిస్ట్రార్ ఏ.వెంకటరమణ పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. ఇదే సమయంలో ఆయా పోస్టుల్లో వారినే కొనసాగించాలా? లేక ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. అయినా బుధవారం వరకూ ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో వారు విధులకు హాజరయ్యారు.
పాలకమండలి గత సమావేశంలో రెక్టార్, రిజిస్ట్రార్‌ల పదవీ కాలం జనవరి 3న ముగుస్తుందనే అంశంపై చర్చకు వచ్చింది. దీనిపై ఉన్నత విద్యా కార్యదర్శి సుమిత్రా దావ్రా సూచనల మేరకు వచ్చే పాలకమండలి సమావేశం వరకు రెక్టార్, రిజిస్ట్రార్‌లను కొనసాగించాలని సూచించారు. ఈ మేరకు ఆదేశాలేవీ రాలేదు. అయినా రెక్టార్, రిజిస్ట్రార్ విధులకు హాజరుకావడం వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.