చిన్నారిని మింగేసింది !
కొత్తూరు: అధికారుల నిర్లక్ష్యానికి 20 నెలల బాలుడి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ విషాద సంఘటన కొత్తూరు మండలం బలద గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇంకుడు గుంతలో పడి ఏకైక కుమారుడు తనువు చాలించడంతో కన్నవారు కన్నీరు మున్నీరయ్యూరు. వివరాల్లోకి వెళ్తే... ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు తవ్వాలని అధికారులు నిబంధన పెట్టారు. గుంతలు తవ్వకపోతే ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు, రేషన్‌కార్డులు రద్దవుతాయని ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా, ఎక్కడిపడితే అక్కడ గోతులను అందరూ తవ్వేశారు.
అరుుతే బిల్లుల చెల్లింపులో జాప్యం, ఇతరత్రా కారణాలతో గుంతలను కప్పలేదు. ఈ క్రమంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంతలన్నీ నీటితో నిండిపోయూయి. బలద గ్రామానికి చెందిన సింగుపురం కృష్ణారావు కూడా రెండు నెలల క్రితం తన ఇంటి ముందు ఇంకుడు గుంత తవ్వినప్పటికీ.. ఇప్పటివరకూ బిల్లు చెల్లించలేదు. దీంతో దాన్ని కప్పకుండా అలాగే ఉంచేశాడు.
అరుుతే తన 20 నెలల కొడుకు సాయి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ గుంతలో పడిపోయూడు. ఈ విషయూన్ని ఎవరూ గమనించలేదు. రాత్రి వేళ కావడంతో బాబుకి భోజనం పెట్టేందుకు కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. ఇంతలో ఇంటిముందు ఉన్న ఇంకుడుగుంతలో సారుు కనిపించడంతో బయటకు తీశారు.
కొనఊపిరితో ఉండడంతో ఆటోలో కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేందానికి తీసుకొచ్చారు. బాబుని పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయి చనిపోయినట్టు నిర్ధారించారు. ఏకైక బిడ్డ ఇకలేడని తెలిసి కన్నవారు కృష్ణారావు, రాణి దంపతులు విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. బలడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కొడుకును కోల్పోయిన కృష్ణారావు దంపతులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీవో ఏమన్నారంటే..
ఇంకుడు గుంతలో పడి బాలుడు చనిపోయిన విషయూన్ని ఉపాధిహామీ పథకం మండల ఏపీవో అంగూరు సురేష్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కృష్ణారావుకు చెందిన జాబ్ కార్డును నిలిపివేయడంతో ఇంకుడు గుంతకు బిల్లు చేయలేదని చెప్పారు. ఇదే విషయూన్ని ఇప్పటికే కృష్ణారావుకు చెప్పినట్టు పేర్కొన్నారు.
ఆనందం ఆవిరి
కృష్ణారావు, రాణి దంపతులకు ఒక్కడే బాబు. అల్లారిముద్దుగా పెంచేవారు. నిరుపేదలైనప్పటికీ బాగా చూసుకునేవారు. బుధవారం సాయంత్రం కూడా బాబుని తల్లి రాణి ఆడించింది. అంతలోనే బయటకు వెళ్లి ఇంటిముందు ఉన్న గుంతలో పడి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు తీవ్ర విషాదానికి గురయ్యూరు.