వందే ’గురుతరం’
Published Tue, Sep 5 2017 10:54 PM | Last Updated on Tue, Sep 12 2017 1:57 AM
గురుదేవోభవ.. ఆచార్య దేవోభవ.. మంత్రోచ్ఛరణతో జిల్లా మార్మోగింది. వందే గురుతరం అంటూ విద్యార్థిలోకం నినదించింది. గురువులను పూజించి నమస్సుమాంజలి అర్పించింది. ఉపాధ్యాయ దినోత్సవం మంగళవారం ఉత్సాహంగా జరిగింది. జిల్లా, మండల కేంద్రాల్లో ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను అధికారులు సత్కరించి.. సమున్నత పురస్కారాలు అందించారు.
అది ’గురు’తర బాధ్యత
ఏలూరు (మెట్రో) : ఉత్తమ విలువలతో సమాజాన్ని నిర్మించడం ఒక గురువుకే సాధ్యమని, అది గురుతర బాధ్యతని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం గురుపూజోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో బాపిరాజు మాట్లాడుతూ సమాజంలో గురువు పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ సమాజంలో ఎలా మెలగాలో గురువు నుంచే విద్యార్థులు నేర్చుకుంటారని చెప్పారు. డీఈఓ గంగాభవాని మాట్లాడుతూ అంకితభావం, నిబద్ధతతో పనిచేసిన ఉపాధ్యాకుయులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారిని జెడ్పీ చైర్మన్ బాపిరాజు, కలెక్టర్ కాటంనేని భాస్కర్ సత్కరించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారులు ఉదయ్‌కుమార్, మద్దూరి సూర్యనారాయణమూర్తి, నిడమర్రు జడ్పీటీసీ సభ్యులు దివాకర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉత్తమ గురువులు వీరే..
విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవంలో రాష్ట్ర ఉత్తమ గురువులను సత్కరించారు. వీరిలో మన జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉన్నారు.
ఎం.గోపాలకృష్ణమూర్తి(ఎస్‌జీటీ, ఎంపీపీఎస్, భవానీపేట, ఉండి మండలం),
వి.నాగేశ్వరరావు, (ఎస్‌ఏ(పీఎస్), జెడ్పీహెచ్‌ఎస్, విస్సాకోడేరు, పాలకోడేరు మండలం)
బి.విజయలక్ష్మి (ఎస్‌ఏ (ఎస్‌ఎస్), జెడ్పీహెచ్‌ఎస్, గొల్లగూడెం, ఉంగుటూరు మండలం)
ఎ.వి.రాజశేఖర్ (జేఎల్, జువాలజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఏలూరు)
కె.సునీతాదేవి, (ఎస్‌జీటీ ఎంపీపీఎస్, ప్రత్తికోళ్లలంక)
Advertisement
Advertisement