
తల్లికోసం తల్లడిల్లుతున్న చిన్నారి
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన కె.జ్యోతి(26) ఆచూకీ తెలీకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఏడాదిన్నర కుమారుడు అల్లాడిపోతున్నాడు. పాలు లేక ఆకలితో రోది స్తున్న చిన్నారి అవస్థలు చూసి తండ్రి వెంకన్నబాబుతో పాటు ఆస్పత్రి సిబ్బంది చలించిపోతున్నారు. ఈ నెల 15న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతి తన భర్త వెంకన్నబాబుతో కలిసి కుమారుడిని చికిత్స నిమిత్తం రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకు వచ్చింది. భర్త చిన్నారికి స్కానింగ్ తీయించేందుకు లోపలికి వెళ్లగా ఆమె భర్తకు తెలియకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్నారి తల్లికోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అయితే, కనిపించకుండా పోయిన జ్యోతి ఆచూకి కోసం పోలీ సులు ప్రత్యేక బృందంతో గా లింపు చేపట్టినా ఫలితం కనిపించ లేదు. రెండు బృందాలను విజయవాడ, నెల్లూరుకు పంపించారు. ఆస్పత్రిలో చిన్నరి పరిస్థితి క్షీణిస్తున్నదని వైద్యులు తెలిపారు.