మంకమ్మతోట(కరీంనగర్): కరీంనగర్ పట్టణంలోని ఐసీడీఎస్ శిశుగృహంలో జరిగిన అమానుష ఘటనపై జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ బుధవారం కఠిన చర్యలు తీసుకున్నారు. ముగ్గురు ఆయాలను సర్వీసు నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసులకు ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ శిశుగృహంలో విధుల్లో ఉన్న ఇద్దరు ఆయాలు ఎనిమిది మంది చిన్నారులకు స్పూన్‌తో కాల్చి వాతలు పెట్టారు. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ విషయం మంగళవారం వెలుగు చూసిన విషయం తెలసిందే. దీంతో కలెక్టర్ నీతూ ప్రసాద్ బుధవారం శిశుగృహాన్ని సందర్శించారు. చిన్నారులతో మాట్లాడారు. ఐసీడీఎస్ పీడీ మోహన్‌రెడ్డిపై ఆమె సీరియస్ అయ్యారు. శిశుగృహంలో కాంట్రాక్టుపై పని చేస్తున్న ఆయాలు బుచ్చమ్మ, శారద, పద్మలను సర్వీసు నుంచి తొలగించాలని ఆదేశించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించారు.
వాతలు పెట్టిన ఆయాలపై వేటు
Published Wed, Apr 20 2016 4:10 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement