బీజేపీ, టీడీపీలకు రోజులు దగ్గర పడ్డాయి | Bad days to bjp tdp | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీలకు రోజులు దగ్గర పడ్డాయి

Published Fri, Dec 23 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

Bad days to bjp tdp

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : బీజేపీ, టీడీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని.. ఆపార్టీ నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ షాజహాన్‌బాషా పేర్కొన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు రోడ్డున పడ్డారన్నారు.  ఇంత పెద్ద నిర్ణయం  తీసుకునే ముందు ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రి సలహాలు, సూచనలు తీసుకోకపోవడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. సుప్రీం కోర్టు 700 మంది నల్లకుబేరుల పేర్ల జాబితాను ప్రకటించినప్పటికీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తాను చెబితేనే రూ 500,1000 నోట్లు రద్దు చేశారని  గొప్పలు చెప్పుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి కావాల్సినంత నగదును రప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. 50 రోజుల వరకు కష్టాలుంటాయని చెప్పిన ప్రభుత్వాలు..ఈ  తర్వాత కష్టపెడితే 51వ రోజు నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆ«ధ్వర్యంలోబ్యాంకుల వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.  ïడీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్, పీసీసీ జనరల్‌ సెక్రటరీ సత్తార్, జాయింట్‌ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, సేవాదళ్‌ ఛైర్మన్‌ చార్లెస్, విజయభాస్కర్, జోడు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement