బనగానపల్లెలో ఆర్టీసీ సమ్మె
Published Mon, Jun 5 2017 12:13 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
- డిపో నుంచి కదలని బస్సులు
బనగానపల్లె : స్థానిక ఆర్టీసీ డిపోలో చిరకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో ఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, వైఎస్సార్‌సీపీ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సమ్మె నిర్వహించారు. దీంతో బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ప్రయాణికుల సమస్యలను గుర్తించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు మధ్యాహ్నం 3 గంటలకు డిపోకు చేరుకుని యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. ఏకపక్ష నిర్ణయంతో కార్మికులకు పనిభారం పెరిగిందని, కొత్త రిక్రూట్‌మెంట్ చేయాలని, డిపో పరిధిలో తొలగించిన సర్వీసులను వెంటనే పునరుద్దరించాలని, కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను తెప్పించాలంటూ కార్మిక నాయకులు డిమాండ్ చేవారు. కొన్ని సమస్యలను పరిష్కరించడంతో సమ్మె విరమించి ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Advertisement