పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్‌కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ బీసీ సంఘాల నాయకులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను బుధవారం అడ్డుకున్నారు. తణుకు నియోజకవర్గంలో పర్యటించేందుకు వచ్చిన ఆయన వేల్పూరు నుంచి అత్తిలి మార్గంలో వెళుతుండగా కేఎస్ గట్టు గ్రామం వద్ద అడ్డుకున్నారు.
లోకేష్‌ను అడ్డుకున్న బీసీ నేతలు
Nov 9 2016 11:10 PM | Updated on Sep 4 2017 7:39 PM
తణుకు :
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్‌కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ బీసీ సంఘాల నాయకులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను బుధవారం అడ్డుకున్నారు. తణుకు నియోజకవర్గంలో పర్యటించేందుకు వచ్చిన ఆయన వేల్పూరు నుంచి అత్తిలి మార్గంలో వెళుతుండగా కేఎస్ గట్టు గ్రామం వద్ద అడ్డుకున్నారు. వెంకట సుధాకర్‌కు మునిసిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టే సమయంలో రెండున్నరేళ్ల అనంతరం ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. శెట్టిబలిజ వర్గం నుంచి ఆయనను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ లోకేష్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై లోకేష్ వివరణ ఇస్తూ కొన్ని పార్టీలు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీపై ధ్వజమెత్తేందుకు లోకేష్ ప్రయత్నించగా, శెట్టిబలిజ సంఘం నాయకులు అడ్డుకున్నారు. దీనికి కులాలు, పార్టీల రంగు పులమవద్దని హితవు పలికారు. పార్టీ పెద్దలు అప్పట్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసికెళతానని లోకేష్ హామీ ఇవ్వడంతో బీసీ నేతలు శాంతించారు.
Advertisement
Advertisement