టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి తణుకు చేరుకుని బస చేస్తారని, 9వ తేదీ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహిస్తాన్నారు.
రేపు జిల్లాకు లోకేష్ రాక
Published Mon, Nov 7 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి తణుకు చేరుకుని బస చేస్తారని, 9వ తేదీ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహిస్తాన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకూ జిల్లాలో ప్రమాద బీమా పొందిన కార్యకర్తల కుటుంబాలతో సమావేశమౌతారని తెలిపారు. అనంతరం అత్తిలిలో జరిగే జనచైతన్య యాత్రలో పాదయాత్ర చేస్తారన్నారు. అనంతరం ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో యువచైతన్య యాత్రలో భాగంగా విద్యార్థులతో సమావేశమవుతారని పేర్కొన్నారు. సాయంత్రం టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గోనున్నారు.
Advertisement
Advertisement