
దొంగల ముఠాలో ఆర్‌ఎస్‌ఐ కుమారుడు
ఏలూరు: పోలీసులమని చెప్పి అర్థరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసుల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది యువకులున్న ఈ ముఠా పలు దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ బృందంలో విజయవాడకు చెందిన ఆర్‌ఎస్‌ఐ కుమారుడు ఉండడం గమనార్హం.
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మరో అంతరాష్ట్ర నేరస్థుడ్ని తణుకు పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు 2లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.