సత్తాచాటిన ‘పశ్చిమ’ మహిళలు
సత్తాచాటిన ‘పశ్చిమ’ మహిళలు
Published Mon, Oct 10 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM
కొవ్వూరు రూరల్: రాష్ట్ర మూడో సీనియర్ అంతర్ జిల్లాల రాష్ట్ర చాంపియన్‌షిప్ వాలీబాల్ పోటీల్లో పశ్చిమ మహిళా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచినట్టు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి జి.నారాయణరాజు తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకూ నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆర్మీ స్టేడియంలో పోటీలు జరిగాయన్నారు. ఆదివారం ఫైనల్స్‌లో కృష్ణా జట్టుతో తలపడిన పశ్చిమ మహిళలు రన్నరప్‌గా నిలిచారన్నారు. జట్టు సభ్యులు, వేసవి శిక్షణ శిబిరం ద్వారా శిక్షణ ఇచ్చిన జిల్లాలోని కొవ్వూరు గౌతమీ వాలీబాల్ అసోసియేషన్ కోచ్‌లు కొయ్యల ప్రసాద్, డీసీ నాయక్‌ను అసోషియేషన్ సహాయ కార్యదర్శి జి.పవన్‌కుమార్ అభినందించారు.
Advertisement