జిల్లాకు ఉత్తమ ఏరువాక కేంద్రం అవార్డు
జిల్లాకు ఉత్తమ ఏరువాక కేంద్రం అవార్డు
Published Tue, Dec 6 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
నడకుదురు(కరప): రాష్ట్ర స్థాయిలో తూర్పుగోదావరి జిల్లా ఏరువాక కేంద్రం 2015–16 సంవత్సరానికి గాను ఉత్తమ కేంద్రంగా ఎంపికైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 జిల్లాల్లోని ఏరువాక కేంద్రాల్లో జిల్లా ఎంపిక కావడం విశేషం. నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈనెల 4న జరిగిన 46వ ప్రాంతీయ వ్యవసాయ, విస్తరణ సలహామండలి సమావేశంలో వ్యవసాయశాఖ డైరక్టర్ ధనంజయ్‌రెడ్డి చేతులమీదుగా జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పీఎల్‌ఆర్జే ప్రవీణ అవార్డును అందుకున్నారు. కరప మండలం నడకుదురులోని ఏరువాక కేంద్రం కార్యాలయంలో మంగళవారం అవార్డు తీసుకున్న విషయాలను ఆమె వెల్లడించారు. జిల్లాలో అయిదేళ్లుగా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అందించిన సూచనలు, సలహాలు, క్షేత్ర ప్రదర్శనలు, క్షేత్ర సందర్శనలు, రైతులకు, వ్యవసాయ విస్తరణాధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు వంటివి పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ఇచ్చారన్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనంజయ్‌రెడ్డితోపాటు అక్కడి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎన్‌వీ నాయుడు, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ డాక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నట్టు డాక్టర్ ప్రవీణ వివరించారు.
Advertisement
Advertisement