నయీం అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆర్డీవో విచారణ | bhuvanagiri rdo inquiry on nayeem land grabbing in lakshmi narsimha venchar | Sakshi
Sakshi News home page

నయీం అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆర్డీవో విచారణ

Published Sat, Sep 3 2016 10:57 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

bhuvanagiri rdo inquiry on nayeem land grabbing in lakshmi narsimha venchar

నల్గొండ : భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే.

షాద్నగర్లో నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అందులోభాగంగా పలువురు నయీం అనుచరులను ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసి.... విచారిస్తున్నారు. త్వరలోనే ఎవరి ప్లాట్లను వారికి అప్పగిస్తామని ఈ సందర్భంగా ఆర్డీవో భూపాల్రెడ్డి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement