రెండు బైక్‌లు ఢీ : నలుగురికి తీవ్రగాయాలు | bike accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ : నలుగురికి తీవ్రగాయాలు

Published Fri, Jul 22 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

bike accident

 
 
నరసాపురం(ఇందుకూరుపేట) : ప్రమాదవశాత్తు రెండు బైక్‌లు ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మండలంలోని నరసాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. భీమవరానికి చెందిన స్లీఫెన్, దినేష్‌ అనే ఇద్దరు నెల్లూరు నుంచి బైక్‌పై మండలంలోని మైపాడు బీచ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో మైపాడు గ్రామంలోని సంగంకు చెందిన పవన్, శివ అనే ఇద్దరు గంగపట్నం నుంచి బైక్‌పై వస్తున్నారు. గంగపట్నం చీలురోడ్డు వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. వాహనం ఆలస్యంగా రావడంతో బాధితులు గాయాలతో తీవ్రవేదనకు గురయ్యారు. క్షతగాత్రులను నెల్లూరుకు తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement