బాలయ్యకు చంద్రబాబు పరామర్శ | Chandrababu naidu visits Balakrishna's house | Sakshi
Sakshi News home page

బాలయ్యకు చంద్రబాబు పరామర్శ

Published Mon, Aug 11 2014 12:17 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్యకు చంద్రబాబు పరామర్శ - Sakshi

బాలయ్యకు చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం  తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లోని బాలయ్య నివాసానికి వెళ్లిన బాబు .... ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఓ సినిమా షూటింగ్లో మూడు రోజుల క్రితం బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే.

 

బైక్ రేసింగ్ చిత్రీకరణలో భాగంగా ఆయన బైక్ మీద నుంచి పడిపోవటంతో కాలికి గాయం అయ్యింది. వెంటనే బాలకృష్ణను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా స్వల్ప ప్రమాదమేనని కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అనంతరం ఆయన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement