దర్శకుల వెంట పడను.. దర్శకులే నా వెంట పడాలి | directors should come to me, says Balakrishna | Sakshi
Sakshi News home page

దర్శకుల వెంట పడను.. దర్శకులే నా వెంట పడాలి

Published Mon, Aug 18 2014 11:20 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

దర్శకుల వెంట పడను.. దర్శకులే నా వెంట పడాలి - Sakshi

దర్శకుల వెంట పడను.. దర్శకులే నా వెంట పడాలి

హైదరాబాద్ : ప్రతి సినిమాకు తనకు ఓ గాయం గుర్తుగా ఉంటుందని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన సోమవారం కాలికి గాయంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి సినిమా షూటింగ్లో దెబ్బలు తగలడం మామూలేనన్నారు.  ఇటీవల తనకు తగిలిన గాయానికి ఏడు కుట్లు పడ్డాయని, ఈరోజే కుట్లు విప్పారని తెలిపారు. వందో సినిమా గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని, తన వందో సినిమాపై అభిమానుల అంచనాలు ఎక్కువగానే ఉన్నాయని బాలకృష్ణ అన్నారు.

తాను దర్శకుల వెంట పడనని, దర్శకులే తన వెంట పడాలని బాలకృష్ణ అన్నారు. వందో సినిమా ఫలానా దర్శకుడితో తీయాలేని లేదని లేదన్నారు. డైరెక్టర్ల వెంటపడే అలవాటు తనకు లేదని, రికార్డుల కోసం సినిమాలు బలవంతంగా ఆడించుకునే అలవాటు లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇటీవలి  బైక్ రేసింగ్ చిత్రీకరణలో భాగంగా బాలకృష్ణ బైక్ మీద నుంచి పడిపోవటంతో కాలికి గాయం అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement