
కర్రసాయం లేకున్నా నడుస్తున్నా: బాలయ్య
హైదరాబాద్ : సినీనటుడు, హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ .... సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం అసెంబ్లీ లాబీల్లో పరస్పరం పలకరించుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని తలసాని ఈ సందర్బంగా బాలకృష్ణను పరామర్శించారు. కర్ర సాయం లేకుండా నడుస్తున్నానని ఆయన తెలిపారు. కాగా తన నియోజకవర్గమైన హిందుపురంలో బుధవారం నుంచి పర్యటించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. కాగా షూటింగ్ సమయంలో బైక మీద నుంచి పడటంతో బాలయ్య కాలికి గాయమైన విషయం తెలిసిందే.