బాలయ్య మౌనం వెనుక బావ..! | Why was tdp mla, actor balakrishna calm in assembly lobby | Sakshi
Sakshi News home page

బాలయ్య మౌనం వెనుక బావ..!

Published Sun, Dec 21 2014 9:02 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్య మౌనం వెనుక బావ..! - Sakshi

బాలయ్య మౌనం వెనుక బావ..!

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్  శాసనసభ లాబీల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట కలపకుండా మౌనంగా ఉంటున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో తనదైన శైలిలో మాట్లాడుతున్న బాలయ్య.. మీడియా ప్రతినిధులు మాట కలిపేందుకు ప్రయత్నిస్తే మాత్రం వినిపించుకోనట్లు ఉంటున్నారు. దీని వెనుక ఆయన బావ, వియ్యంకుడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ఆదేశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బాలకృష్ణ స్వతహాగా భోళా మనిషి. మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. రాజకీ యాల్లో ఇలా మాట్లాడితే కొన్ని సందర్భాల్లో మంచి, మరికొన్ని సందర్భాల్లో చెడు కూడా జరుగుతుంది. విలేకరులు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలతో పాటు ఇతర అంశాల గురించి ప్రశ్నిస్తే బాలకృష్ణ చెప్పే సమాధానాలతో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఏమి తంటా వస్తుందోనన్న ఆందోళనతో.. శాసనసభ సమావేశాలకు ఎపుడు హాజరైనా నోరు మెదపొద్దని సీఎం స్పష్టంగా చెప్పటంతో మాట్లాడించేందుకు ఏ విలేకరి ఎంత ప్రయత్నించినా ఆయన నోరు మెదపడం లేదని సహచర ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement