నా పాత్రకు అనుగుణంగా మాట్లాడా! | Balayya proffers an apology in AP Assembly | Sakshi
Sakshi News home page

నా పాత్రకు అనుగుణంగా మాట్లాడా!

Published Wed, Mar 9 2016 4:24 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

నా పాత్రకు అనుగుణంగా మాట్లాడా! - Sakshi

నా పాత్రకు అనుగుణంగా మాట్లాడా!

సావిత్రి ఆడియో ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ వివరణ
సాక్షి, హైదరాబాద్: నా పాత్ర ఎలా ఉండాలని జనం కోరుకుంటారో అదే మాట్లాడానని, దాన్ని వారు ఎలా తీసుకున్నారో ప్రజలనే అడగాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్రసంగాన్ని ఆరంభించిన ఆయన ‘సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్‌లో నేను మాట్లాడిన మాటలకు ఎవరికి తోచిన రీతిలో వారు పెడర్థాలు తీశారు. మహిళలంటే తనకు గౌరవమని ఆనాడే చెప్పా.

నేను రెండు రకాలుగా మాట్లాడా... ఎమ్మెల్యేగా కాదు ఒక నటుడిగా నా పాత్ర ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటారో అదే మాట్లాడాను. ఇక్కడ ఉన్న పది మందో వందమందో చెప్పింది కాదు. జనం అభిప్రాయం తీసుకోండి. నా మాటలను వారు ఎలా రిసీవ్ చేసుకున్నారో అడగండి. వాళ్లే చెబుతారు.. నా సినిమాల్లో మహిళలకు మంచి పాత్రలు ఇచ్చాను...’ అంటూ బాలకృష్ణ కొంత అస్పష్టంగా చేతులు తిప్పుతూ చెప్పారు. అక్కడున్న వారికి తెలుగు అర్థం కాదు.. వాళ్లంతా నా మాటలను ఎంజాయ్ చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement