బిలాస్‌పూర్ లో ఘనంగా పస్కల పండుగ
కోహీర్: మండలంలోని బిలాల్‌పూర్ సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చి ఆవరణలో పస్కల పండగ వేడుకను ఆదివారం క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. వర్షాకాలంలో వర్షాలు సక్రమంగా కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఏటా వర్షకాలంలో పస్కల పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
సంఘ కాపరి రాజరత్నం నేతృత్వంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం సహాపంక్తి భోజనం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో క్రైస్తవులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు,