Bilalpur
-
‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’
సాక్షి, కోహీర్(జహీరాబాద్): దాదాపు ప్రతీ ఊరు పేరు వెనుక ఒక చరిత్ర ఉంటుంది. మండలంలోని బిలాల్పూర్ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. అదే ఒక గజదొంగ పేరిట గ్రామం వెలిసింది. ఆ పేరే సినీ దర్శకులు నాగసాయి, నిర్మాత మహాంకాళి శ్రీనివాస్‌లకు నచ్చింది. ఇంకేముంది, వర్ధమాన నటులు మాగంటి శ్రీనాథ్, మేఘన నటించిన ‘బిలాల్పూర్ పోలిస్టేషన్’ గా రూపుదిద్దుకొని నేడు విడుదలకు సిద్ధమైంది. మండల కేంద్రమైన కోహీర్కు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాల్పూర్ గ్రామానికి చరిత్ర ఉంది. నాలుగు వందల సంవత్సరాల క్రితం బిలాలోద్ధీన్ అనే గజదొంగ తన శత్రువుల నుంచి రక్షణకోసం బురుజు నిర్మించుకొని చుట్టూ కందకం ఏర్పరచుకొని తన అనుచరులతో కలిసి నివసించేవాడు. శత్రువుల నుంచి రక్షణ నిమిత్తం తోపులను ఉపయోగించేవారు. ఎల్లప్పుడూ కందకంలో నీరు నింపి ఉంచేవారు.తమ శత్రువులు కందకం దాటి వచ్చేలోపు మట్టుబెట్టేవారు. (ఇప్పటికినీ బురుజును, కందకాన్ని చూడవచ్చు) కొన్నాళ్లకు బిలాలోద్ధీన్ అంకం ముగిసింది. గజదొంగ బిలాలోద్ధీన్ నివాసించడం చేత గ్రామానికి బిలాల్పూర్ లనే పేరు స్థిరమైనది. వందేళ్ల క్రితం బురుజు వద్ద మైసమ్మగుడి కట్టారు. ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్నారు. అయితే గత సంవత్సరం సినిమా షూటింగ్‌ను యాక్షన్, కామెడీ సినిమాను మండల కేంద్రమైన కోహీర్‌తో పాటు బిలాల్పూర్, బడంపేట, దిగ్వాల్ పరిసర ప్రాంతాల్లో నిర్మించారు.ఇందులో స్థానికులు శివమూర్తి స్వామి, ప్రభుగారి శుభాష్‌తో పాటు బడంపేట గ్రామస్తులు నటించారు. పోలీసుల జీవన ప్రధానంగా తీసిన చిత్రానికి బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్ అని పేరు పెట్టారు. జహీరాబాద్‌లోని మోహన్ టాకీసులో సినిమాను నేడు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. -
నటనపై గౌరవం పెరిగింది
‘‘నటనలో నాకు పెద్దగా అనుభవం లేదు. ‘బతుకమ్మ’ సినిమా అప్పుడు ఇటీవల మరణించిన దీక్షితులుగారు మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. అలాగే నాటకరంగంలో ఉన్న ప్రవేశం కూడా సహాయపడింది. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలో ఫుల్‌లెంగ్త్ పాత్ర చేసిన తర్వాత నటనపై చాలా గౌరవం పెరిగింది’’ అన్నారు రచయిత, గాయకులు గోరటి వెంకన్న. మాగంటి శ్రీనాథ్ హీరోగా మాకం నాగసాయి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ– ‘‘నిర్మాత శ్రీనివాస్, సాయి బాగా తెలుసు. అందుకే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి, హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాత్రలో నటించాను. అరుణయ్య అనే మిత్రుడు కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయికి చేరుకున్నారు. నాకు ఆయనే గుర్తుకొచ్చారు. ఆ పాత్రనే వేశాను అనిపించింది. టీమ్ అందరూ ప్రోత్సహించారు. ఓ సీన్లో భాగంగా నన్ను ఏడవమన్నారు. గ్లిజరిన్ లేకుండా పదిసార్లు ఏడ్చాను. ఆ సీన్ బాగా పండింది. దృశ్య మాద్యమం చాలా శక్తివంతమైనది. ఎవరైనా పాత్రలు చేయమని ప్రేమతో అడిగితే చేస్తాను. పాత్రల కోసం పని కట్టుకుని పోను. ప్రేమ గీతాలు రాశాను. మనసు చంపుకుని ఓ స్పెషల్ సాంగ్ కూడా రాశాను. ‘దొరసాని’, ‘సంత’, ‘మల్లేశం’, ‘నేనే..సరోజ’, ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ చిత్రాలకు పాటలు రాశాను. కొన్ని పెద్ద సినిమాల్లో పాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి. వద్దనుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
ఆ కష్టాలు సినిమా వాళ్లకే తెలుసు
‘‘మా శ్రీనివాస్ వ్యాపార రంగంలో ఉన్నారు. సినిమాలకు కొత్త అయినప్పటికీ మంచి చిత్రాన్ని రూపొందించారు. మనకు పైకి కనిపించే సినిమా రంగులమయంగా ఉంటుంది. కానీ, దానిలో కష్టాలు సినిమా చేసే వాళ్లకే తెలుస్తాయి. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలో మా పాలమూరు జిల్లాకు చెందిన వాళ్లే ఉండటం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయవంతం కావాలి’’ అని మాజీ మంత్రి డి.కె. అరుణ అన్నారు. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. సాబూ వర్గీస్ సంగీతం అందించిన పాటలను డి.కె. అరుణ విడుదల చేశారు. ‘‘చిన్నప్పటి నుంచి నాకు కళలపై ఆసక్తి. కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో దర్శకుణ్ణి అవుదామని కృష్ణానగర్ వచ్చాను. చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ల కష్టాలు చూసి ఇక్కడ మనం ఉండలేం అని తిరిగి వెళ్లిపోయాను. వ్యాపారంలో స్థిరపడ్డాను. ఆనాటి నా ఆకాంక్షని ఈరోజు నిర్మాతగా మారి సినిమా చేశాను’’ అన్నారు మహంకాళీ శ్రీనివాస్. ‘‘నాకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి పెద్దగా ఉండదు. మహంకాళీ శ్రీనివాస్ విలువలు తెలిసిన వ్యక్తి. అందుకే ఈ చిత్రంలో నటించాను’’ అని పాటల రచయిత గోరటి వెంకన్న అన్నారు. ‘‘ఆద్యంతం సహజంగా సాగే కథాకథనాలతో మా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సందేశాత్మకంగా ఉన్నా వాణిజ్య అంశాలకు0 ఎక్కడా లోటుండదు’’ అన్నారు నాగసాయి మాకం. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, పాటల రచయిత మౌన శ్రీ మల్లిక్, సినిమాటోగ్రాఫర్ తోట వి. రమణ తదితరులు పాల్గొన్నారు. -
నవ్వులు పంచే పోలీస్ స్టేషన్
మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా, గోరేటి వెంకన్న కీలక పాత్రలో నటించిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. నాగసాయి మాకం దర్శకత్వంలో ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఇందులో చూపించాం. తప్పకుండా ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా అవుతుంది. మంచి కథకు నిర్మాణ విలువలు తోడైతేనే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పెద్ద నిర్మాణ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా మా సినిమా ఉంటుంది. మార్చి రెండో వారంలో ఓ పెద్ద పంపిణీ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బిలాల్పూర్ అనే ఊరి పోలీస్ స్టేషన్‌కు వచ్చే వింత వింత కేసులు కడుపుబ్బా నవ్విస్తాయి. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ఇది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా తెరకెక్కించాం. సినిమా చూస్తున్న వాళ్లకు తమ ఊరిలో జరిగే సంఘటనలు గుర్తొస్తాయి’’ అని నాగసాయి మాకం అన్నారు. ప్రణవి, ఆర్ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తోట వి. రమణ, సంగీతం: సాబూ వర్గీస్. -
వైద్యసేవలందేనా?
పీహెచ్సీ నిర్మాణానికి నిధులు మంజూరు నాలుగేళ్లైనా పూర్తికాని వైనం వైద్యసేవల కోసల గ్రామీణుల ఎదురుచూపులు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి భవన నిర్మాణం చేపట్టింది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్లుగా నిర్మాణంపూర్తికాలేదు. అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. తమకు మరింత దగ్గరలో వైద్యసేవలు పొందవచ్చకున్న గ్రామీణుల ఆశలు నెరవేరేలా కనబడటంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోహీర్:మండలంలోని బిలాల్పూర్ గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనులు ప్రారంభించి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు నిర్మాణం పూర్తికాలేదు. వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయనుకొన్న ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. బిలాల్పూర్ గ్రామంలో 2011-12 ఆర్థిక సంవత్సరంలో పీహెచ్సీ నిర్మాణం కోసం రూ. 48 లక్షలు మంజూరైయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విభాగం అధికారులకు పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. అదే సంవత్సరంలో టెండరు ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించారు. దీంతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎంతో సంబరపడ్డారు. పనులకు శంకుస్థాపన చేయకుండానే పనులు ప్రారంభించారని అప్పటి అధికార పార్టీ నాయకులు కినుక వహించి సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పనులకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి పనులు కొనసాగించిన దాఖాలు లేవని స్థానికులు చెబుతున్నారు. మిగిలిన పనులు పూర్తిచేస్తే భవనం వినియోగంలోకి వస్తుంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తే స్థానిక బిలాల్పూర్తో పాటు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనియార్‌పల్లి, మాణిక్యనాయక్ తండా, బడంపేటతో బాటు కర్ణాటకలోని శివరాంపురం ప్రజలకు సైతం వైద్యసేవలందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రజలు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోహీర్కు రావాల్సి వస్తోంది. ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తే దిగ్వాల్ పీహెచ్‌సీపై భారం తగ్గుతుంది. మరింత మెరుగైన వైద్యసేవలు అందే అవకావం ఉంది. ప్రస్తుతం దిగ్వాల్ పీహెచ్సీ ద్వారా మండలంలోని 20 గ్రామ పంచాయతీలు ఆరు ఆమ్లెట్ గ్రామాల సబ్సెంటర్లను నియంత్రించాల్సి వస్తోంది. భవనంతోపాటు రోడ్డు నిర్మాణం చేపట్టాలి పీహెచ్సీ భవన నిర్మాణానికి గ్రామ కంఠంలో స్థలం అందుబాటులో లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న ప్రభుత్వ స్థలం కేటాయించి నిర్మాణంచేపట్టారు. అయితే ఈ పీహెచ్‌సీకి బిలాల్పూర్ ప్రజలు రావాలంటే రహదారి సౌకర్యం లేదు. అలాగే మనియార్‌పల్లి, మాణిక్యనాయక్ తండావాసులకు కూడా ఇబ్బందే. వీరు వచ్చే మార్గం బండి కచేరలు, గుంతలమయం. ఆరోగ్య కేంద్రంతోపాటు రోడ్లను సైతం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. జాప్యం తగదు. బిలాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తిచేయకుంటే కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాల్సి ఉండగా ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ఇప్పటికైన నిర్మాణంపై దృష్టిసారించి పనులను వెంటనే పూర్తి చేయించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. - శ్రీనివాస్, మనియార్‌పల్లి వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వైద్య సేవల నిమిత్తం మండల కేంద్రమైన కోహీర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని వెళ్లడానికి వ్యయప్రయాసకు గురికావాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలందర మృత్యువాతపడుతున్నారు. పీహెచ్సీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తేవాలి. - రాజు, ఎంపీటీసీ, బిలాల్పూర్. సహనం నశిస్తోంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై సహనం నశిస్తోంది. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని ప్రజలు మాపై ఒత్తిడి తెస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. ఫోన్ ద్వారా కాంట్రాక్టర్‌ను సంప్రదించినా ఫలితం లేకుండాపోతోంది. వైద్యఆరోగ్య శాఖ, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పనులను పూర్తి చేయించాలి. - పంతులు అశోక్, సర్పంచ్, బిలాల్పూర్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బిలాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. కాంట్రాక్టర్ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. సంబంధిత శాఖ అధికారులకు లేఖద్వారా తెలియజేశాం. సాధ్యమైనంత తొందరగా నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని కోరాం. అమర్‌సింగ్, జిల్లా వైద్యాధికారి. -
బిలాస్పూర్ లో ఘనంగా పస్కల పండుగ
కోహీర్: మండలంలోని బిలాల్పూర్ సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చి ఆవరణలో పస్కల పండగ వేడుకను ఆదివారం క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. వర్షాకాలంలో వర్షాలు సక్రమంగా కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఏటా వర్షకాలంలో పస్కల పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంఘ కాపరి రాజరత్నం నేతృత్వంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం సహాపంక్తి భోజనం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో క్రైస్తవులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు, -
మహిళపై అత్యాచారం చేసి యాసిడ్ పోశారు!
గజ్వేల్ : ఒంటరిగా వెళ్తున్న మహిళపైఅత్యాచారానికి పాల్పడి ఆపై యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన గజ్వేల్‌లో బుధవారం రాత్రి కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. దిలాల్పూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ (35)కు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. భర్త నాలుగేళ్ల క్రితం మృతి చెందడంతో తన కుమారుడితో(10) కలిసి గ్రామంలోని తన తల్లిదండ్రులు వద్ద ఉంటోంది. మంగళవారం ఆమె కూరగాయలు తీసుకునేందుకు గజ్వేల్‌కు వచ్చింది. ఆమెను వెంబడిస్తున్న ఇద్దరు వ్యక్తులు బలవంతంగా బైక్‌పై ఎకి ్కంచుకుని నాచారం గుట్ట వద్దకు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడడమే కాకుండా యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం బాధితురాలిని స్వగ్రామంలో వదిలి పరారయ్యారు. కుమార్తె ముఖంపై గాయాలు చూసిన తల్లి బుధవారం గజ్వేల్ ఆస్పత్రికి తీసుకువచ్చింది. వైద్యులు పోలీసులకు సమాచారమందించి చికిత్స ప్రారంభించారు. ఎస్పీ విచారణ సమాచారం అందుకున్న ఎస్పీ సుమతి గజ్వేల్‌కు చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా కింద పడేయడడం వల్ల గాయాలయ్యాయన్నారు. యాసిడ్ దాడి జరిగిందా లేదాఅన్న విషయంపై వైద్య నిపుణులచే పరీక్షలు జరిపిస్తామన్నారు.