మహిళపై అత్యాచారం చేసి యాసిడ్ పోశారు! | Rape and poured acid! | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారం చేసి యాసిడ్ పోశారు!

Published Thu, Jan 22 2015 1:54 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

మహిళపై అత్యాచారం చేసి యాసిడ్ పోశారు! - Sakshi

మహిళపై అత్యాచారం చేసి యాసిడ్ పోశారు!

గజ్వేల్ : ఒంటరిగా వెళ్తున్న మహిళపైఅత్యాచారానికి పాల్పడి ఆపై యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన గజ్వేల్‌లో బుధవారం రాత్రి కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. దిలాల్‌పూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ (35)కు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. భర్త నాలుగేళ్ల క్రితం మృతి చెందడంతో  తన కుమారుడితో(10) కలిసి గ్రామంలోని తన తల్లిదండ్రులు వద్ద ఉంటోంది.

మంగళవారం ఆమె కూరగాయలు తీసుకునేందుకు గజ్వేల్‌కు వచ్చింది. ఆమెను వెంబడిస్తున్న ఇద్దరు వ్యక్తులు బలవంతంగా బైక్‌పై ఎకి ్కంచుకుని నాచారం గుట్ట వద్దకు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడడమే కాకుండా యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం బాధితురాలిని స్వగ్రామంలో వదిలి పరారయ్యారు.  కుమార్తె ముఖంపై గాయాలు చూసిన తల్లి బుధవారం గజ్వేల్ ఆస్పత్రికి తీసుకువచ్చింది. వైద్యులు  పోలీసులకు సమాచారమందించి చికిత్స ప్రారంభించారు.
 
ఎస్పీ విచారణ
సమాచారం అందుకున్న ఎస్పీ సుమతి గజ్వేల్‌కు చేరుకుని  బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా కింద పడేయడడం వల్ల గాయాలయ్యాయన్నారు. యాసిడ్ దాడి జరిగిందా లేదాఅన్న విషయంపై వైద్య నిపుణులచే పరీక్షలు జరిపిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement