యువతిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం
మేడ్చల్: యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన ఓ యువకుడు ఆమెను హోటల్‌కు రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎస్‌ఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన రవూఫ్(27) నగరంలో ఎంబీఏ చదివి ఖాళీగా ఉంటున్నాడు. మేడ్చల్‌కు చెందిన యువతి(18) నగరంలో డిగ్రీ చదువుతోంది. ఈక్రమంలో వీరికి నగరంలోని ప్యారడైజ్ బస్టాండ్ వద్ద పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. రవూఫ్ యువతిని రకరకాలుగా ఫొటోలు తీసి వాటిని మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చాడు. తనకు లొంగకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని తరుచూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో ఈనెల 14న నగరంలోని ఓ హోటల్‌కు యువతిని రప్పించుకున్న అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.