woman photos
-
యువతి ఫొటోలు మార్ఫింగ్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/తెనాలి రూరల్: ఒకవైపు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం మీద దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. మరోవైపు మహిళలకు రక్షణ కల్పిస్తామని, వేధింపులను అరికడతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత రోజుకొక ప్రకటన చేస్తున్నారు. కానీ, వైద్య రంగంలోనే ఉన్న ఓ యువతి ఫొటోలను టీడీపీ నాయకుడి తమ్ముడు, మరో ఇద్దరు కలిసి మార్ఫింగ్ చేసి బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... తెనాలికి చెందిన ఓ యువతి వైద్య రంగంలో స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్‌గా చేస్తున్నారు. ఆమె ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేశారు. వాటిని కొరియర్ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. దీంతో బాధితురాలు రెండు వారాల కిందట తెనాలి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడు అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్, గుంటూరులోని గోరంట్లకు చెందిన భరత్‌ను ఐదు రోజులు కిందట అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ, హార్డ్‌వేర్ ఇంజినీర్ అయిన భరత్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరినీ గుట్టుగా తమ స్వస్థలాలకు పంపినట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు ఇద్దరు నిందితులను వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ లింక్‌పై విచారణ ఏదీ? అబ్దుల్ సత్తార్, కరుణాకర్, భరత్ హైదరాబాద్ కేంద్రంగా కొన్నేళ్ల నుంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. తెనాలి పోలీసుల విచారణలో వీరి వద్ద అనేకమంది యువతులు, మహిళల నగ్న చిత్రాలు లభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకరు ఆమెతో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుల ప్రమేయంతోనే పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే నిందితులను వదిలిపెట్టినట్లు సామాజిక మధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.కేసు దర్యాప్తు పూర్తి కాలేదు ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేసులో ఎవరినీ వదిలిపెట్టలేదు. ప్రధాన నిందితుడిని మాత్రమే అరెస్టు చేశాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరింతమంది నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో సున్నితమైన అంశాలు ఉండడంతో పూర్తి వివరాలను అప్పుడే వెల్లడించే అవకాశం లేదు. – ఎ.సుధాకర్, తెనాలి టూ టౌన్ సీఐ -
TSPSC: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దించారు. తాజాగా ప్రధాన నిందితుడు ప్రవీణ్ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్ 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే అక్కడికి వచ్చే మహిళల ఫోన్ నంబర్లను నిందితుడు తీసుకునేవాడని తేలింది. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యతం పెంచుకున్నాడు. పలువురు మహిళలలో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ సెల్ఫోన్లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, వాట్సాప్‌లో న్యూడ్ చాటింగ్‌లు ఉండడాన్ని గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. TSPSC కార్యాలయం వద్ద ఉద్రిక్తత టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పేపర్ లీకేజీ వ్యవసహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం లోపలికి విద్యార్థి సంఘాల నాయకులు చొచ్చుకెళ్లడంతో.. పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని నెల 2న రూ.5 లక్షలు ఇచ్చిన రేణు, ఆమె భర్త.. మరోసారి 6న తేదీన ప్రవీణ్‌ను కలిసి ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రఘునాథ్ నేతృత్వంలోని బృందం.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత.. అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్ చేశారు? ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు. ఉద్యోగులు ఇద్దరిపై వేటు అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. -
ఏవో చెత్త బుద్ధి.. మహిళల ఫొటోలు తీసి ‘ఈమె ఎలా ఉంది’ అంటూ
సాక్షి, నల్గొండ: వ్యవసాయ శాఖలో ఉత్తమ ఏవోగా పేరుపొందాడు.. కానీ తన అనైతిక ప్రవర్తనతో చివరికి కటకటాల పాలయ్యాడు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్‌రెడ్డి మహిళల ఫొటోలు తీసి.. ‘ఈమె ఎలా ఉంది’.. అంటూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ విషయం సంబంధిత మహిళలకు తెలియడంతో ఆయనపై నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాలలో నిందితుడు పెట్టిన పోస్టులను పరిశీలించిన పోలీసులు విజయ్‌రెడ్డిని అరెస్టు చేశారు. విజయ్‌రెడ్డిని కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
దొంగచాటుగా మహిళల ఫొటోలు తీసి.. ట్విటర్లో పెట్టి..
సాక్షి, జగిత్యాల జిల్లా: అతడో వాటర్ బబుల్ బాయ్.. మినరల్ వాటర్ సరఫరా చేస్తూ.. అదను చూసి దొంగచాటుగా మహిళల ఫొటోలు చిత్రీకరించాడు.. ఓ మహిళ పేరిట ట్విటర్ ఖాతా తెరిచాడు.. సుమారు 400 ఫొటోలను అందులో అప్లోడ్ చేశాడు.. విషయం తెలిసిన బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి నల్ల రవి(34) మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎకీన్పూర్, సంగెం గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ వాటర్ బబుల్స్ సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళల ఫొటోలను మొబైల్ ఫోన్లో దొంగచాటుగా చిత్రీకరించాడు. సుమారు ఏడాదిగా దాదాపు 400 మంది మహిళలను ఫొటోలు తీసినట్లు సమాచారం. ఇలా తీసిన ఫొటోలను మంగళవారం ఉమ పేరిట ట్విటర్ ఖాతా తెరిచి అందులో అప్లోడ్ చేశాడు. వీటిని చూసిన సంగెం గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆ వెంటనే కోరుట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆచూకీ కోసం ఎస్సై సతీశ్‌కుమార్ ప్రయత్నించగా మొబైల్ ఫోన్‌స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆరా తీయగా ఇంట్లో కూడా లేడని తెలిసింది. అయితే, ట్విటర్లోని ఫొటోలు వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే, ఈ ఫొటోలు అశ్లీలంగా లేవని తెలిసింది. -
ఆన్‌లైన్‌తో ఆటలొద్దు.. అవి అప్లోడ్ చేయొద్దు
సాక్షి, బెంగళూరు : అనవసరంగా మీ ఆడపిల్లల ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయరాదు. దీనివల్ల మీకు అవమానాలు తప్పవు అని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ ప్రజలను హెచ్చరించారు. సోమవారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో సైబర్ నేరాలు పెచ్చు మీరుతున్నాయి. కొందరుఇంట్లో కూర్చుని అకృత్యాలకి పాల్పడుతున్నారు. ఆన్లైన్లో పాఠాల పేరుతో అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసుకుని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందితే తక్షణం చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. (భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్ ) ఆ నేరాలు పెరుగుతున్నాయి ఇంటర్నెట్ అనేది ఇంట్లో ఉన్న కిటికీ, తలుపులు వంటివి. ఇంటిని ఎలా కాపాడుకుంటామో అలాగే ఆన్లైన్ గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ ఇంట్లో అక్కచెల్లెలు, భార్యా పిల్లలు ఫోటోలను దయచేసి ఆన్లైన్లో పెట్టరాదు. కొందరు మీ కుటుంబసభ్యుల ఫోటోలను అశ్లీలంగా సృష్టించి మిమ్మల్ని భయబ్రాంతులకు గురి చేయవచ్చు. ఇలాంటి ఘటనలు లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చున్న వారితో జరుగుతున్నాయి అని హెచ్చరించారు. (ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు ) పోలీస్ స్టేషన్లలో కరోనా జాగ్రత్తలు గత మూడు నెలల నుంచి పోలీసులు కరోనాతో పోరాటం చేస్తున్నామని, మార్చి నుంచి అన్ని పోలీస్స్టేషన్లలో మాస్కులు ధరించడం, వేడి నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలని హెచ్చరించామన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని చోట్ల వ్యాపించి బలి తీసుకుంటోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ ఉమ్మరాదని, నిత్యం వేడినీరు తాగాలని సూచించామన్నారు. కొన్ని పోలీస్స్టేషన్లలో వాషింగ్మెషిన్లు కూడా పెట్టామని తెలిపారు. కరోనా సోకిన పోలీసుల రక్షణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
మహిళను కట్టేశారని సోషల్ మీడియాలో పోస్టింగ్
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో కార్యాలయంలోని ఓ గదిలో మహిళను కాళ్లు, చేతులు కట్టేసినట్టు సోషియల్ మీడియాలో బుధవారం ఫొటోలు హల్చల్ చేశాయి. దీంతో అధికారులు ఉలిక్కిపడి ఆలయ కార్యాలయం వద్దకు పరుగులు తీశారు. తహసీల్దార్ భాగ్యలత, ఎంపీడీవో శంకరయ్య, హెడ్‌కానిస్టేబుల్ రఘు అన్ని గదులను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. గత ఏడాది మేలో అక్కడ పనిచేస్తున్న స్వీపర్ రత్నమ్మను కాళ్లు, చేతులు కట్టేసి పడేసిన సంఘటన సంచలనం కలిగించింది. అప్పుడు తీసిన ఫొటోలను బుధవారం జరిగినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలిపారు. స్వీపర్లుగా పనిచేస్తున్న రత్నమ్మ, పార్వతమ్మ ఈ నెల 3న జరిగిన హుండీ లెక్కింపులో నగదు చోరీ చేశారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారు ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు. -
యువతిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం
మేడ్చల్: యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన ఓ యువకుడు ఆమెను హోటల్‌కు రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎస్ఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన రవూఫ్(27) నగరంలో ఎంబీఏ చదివి ఖాళీగా ఉంటున్నాడు. మేడ్చల్‌కు చెందిన యువతి(18) నగరంలో డిగ్రీ చదువుతోంది. ఈక్రమంలో వీరికి నగరంలోని ప్యారడైజ్ బస్టాండ్ వద్ద పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. రవూఫ్ యువతిని రకరకాలుగా ఫొటోలు తీసి వాటిని మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చాడు. తనకు లొంగకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని తరుచూ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో ఈనెల 14న నగరంలోని ఓ హోటల్‌కు యువతిని రప్పించుకున్న అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.