అంధ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Published Tue, May 9 2017 12:23 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) :
సీటీఆర్‌ఐ వద్ద జియోన్ అంధుల పాఠశాల విద్యార్థిని పొగడ గౌరి (8) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం మధ్యాహ్నం కోడిమాంసంతో, రాత్రి గుడ్లతో ఆమె భోజనం చేసినట్టు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. అర్ధరాత్రి ఆమె అస్వస్థతకు గురి కావడంతో సిబ్బంది హాస్పిటల్‌కు తరలించారు. ఈసీజీ తీసిన వైద్యులు బాలిక పరిస్థితి బాగానే ఉందనప్పటికీ అనంతరం కొద్దిసేపటికే ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని వివరించారు. ఆరు నెలల క్రితం గోకవరం బస్టాండ్‌లో భిక్షాటన చేసుకుంటున్న ఈ బాలికను ఈ పాఠశాలకు చైల్డ్ హెల్ప్‌లై¯ŒS ప్రతినిధులు తరించారు. గుడ్లు తినడం వల్లే బాలికకు అస్వస్థతకు గురై మృతి చెందిందని పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే నాలుగు గుడ్లు తినడం వల్ల బాలిక మృతి చెంది ఉంటుందా? అన్న ప్రశ్నలు వినవస్తున్నాయి. భోజనం చేసిన మిగిలిన వారు బాగానే ఉన్నందున ఆమె మాత్రమే ఎందుకు అస్వస్థతకు గురైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. త్రీటౌ¯ŒS పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement