పల్లెల్లో నీలి విప్లవం | Blue Revolution In Villages | Sakshi
Sakshi News home page

పల్లెల్లో నీలి విప్లవం

Published Thu, Oct 6 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

పల్లెల్లో నీలి విప్లవం

పల్లెల్లో నీలి విప్లవం

  • జిల్లాలో చేప పిల్లల పంపిణీకి నిధులు మంజూరు
  • మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తోంది
  • డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
  • మాధన్నపేట చెరువులో కార్యక్రమం ప్రారంభం
  • నర్సంపేటరూరల్‌ : తెలంగాణ పల్లెల్లో మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నీలి విప్లవంగా చేపడుతున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.  మండలంలోని మాధన్నపేట చెరువులో బుధవారం ఆయన చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 46 కోట్లతో 4697 చెరువులు, రిజర్వాయర్లలో మేలురకాలైన బొచ్చె, రోహు, మ్రిగాల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ జిల్లాలోనే 16 జలాశయాలు, 717 చెరువుల్లో 4.44 లక్షల చేప పిల్లల పంపిణీకి నిధులు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 592 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని 46, 200 మంది మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లలను వందశాతం సబ్సిడీతో, ట్రాలీలను 75 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్లు వివరించారు.
     
    నర్సంపేటలోని 66 సొసైటీలకు చేపల పంపిణీతో పాటు  18 సంఘాలకు రూ.10 లక్షలతో కమ్యూనిటీ భవనాలను అందిస్తున్నామని తెలిపారు. ఇందులో రూ.లక్ష సంఘం డిపాజిట్‌ చేస్తే, రూ.9 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఎంపీ సీతారాంనాయక్, జడ్పీ చైర్‌ పర్స¯ŒS గద్దల పద్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా  రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, నగర పంచాయతీ చైర్మ¯ŒS పాలెల్లి రాంచందర్, టీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శ¯ŒSరెడ్డి, సర్పంచ్‌లు ఆకుతోట కుమారస్వామి, సున్నం కొమ్మాలు, మండల అధ్యక్షుడు మచ్చిక నర్సయ్య, కార్యదర్శి గూళ్ల అశోక్, ఎంపీటీసీ అజ్మీర శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement