small fishes distribution
-
81 కోట్ల చేపలు.. 5 కోట్ల రొయ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారం భించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లోని 24 వేల చెరువులు, రిజర్వాయర్లలో రూ.50 కోట్ల ఖర్చుతో 81 కోట్ల చేప పిల్లలను, 78 నీటి వనరులలో రూ.10 కోట్ల ఖర్చుతో 5 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను విడుదల చేసేలా ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 5న సిద్దిపేట జిల్లాలోని కొండ పోచమ్మ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చేప పిల్లలను విడుదల చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఆ కార్యక్రమానికి 25 మంది మాత్రమే ఉండేలా చూడాలని, మాస్క్‌లు తప్పని సరిగా ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు.ఇక, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రెండో విడత పాడి గేదెలు, గొర్రెల పంపిణీ ని త్వరలోనే చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్ ఎల్డీఏ సీఈవో మంజువాణి, విజయా డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు, ఏడీ రాంచందర్, మత్స్య శాఖ జేడీ శంకర్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ నిర్ణయాలతో సంతోషం.. అనంతరం మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తన మానసపుత్రిక అయిన ఉచిత చేప పిల్లల, గొర్రెల, పాడి గేదెల పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, వలలు అందించినట్లు, వారు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. చేపలను ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం అభివృ ద్ధి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు, పాడి గేదెలు మరణి స్తే బీమా ద్వారా జీవానికి బదులు జీవాన్ని కొనుగోలు చేసి ఇస్తున్నామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1962 ద్వారా గ్రామాల్లోని జీవాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మెగా డెయిరీ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి మే 2021 వరకు కత్రిమ గర్భధారణ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రస్తుతం కరీం నగర్‌లోని కేంద్రం ద్వారా మాత్రమే పశువీర్య ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. -
చేప.. ఎంతకీ పెరగక!
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. చెరువుల్లో పోసిన చేపపిల్లలు ఎనిమిది నెలలైనా అరకిలో పరిమాణానికి కూడా పెరగకపోవడంతో మత్స్యకారులు దిగాలు పడుతున్నారు. నాణ్యత లేని చేపపిల్లల్ని పంపిణీ చేయడమే ఇందుకు కారణమని మత్స్యకారులు అంటుండగా, ఫీడింగ్ లోపాలే కారణమని అధికారులు అంటున్నారు. జీవన ప్రమాణాలు పెంచాలని.. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల ను అటు సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు ఇటు మత్స్య సంపద కేంద్రాలుగా మార్చడం ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 80 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు చేపపిల్లలను చెరువుల్లో అట్టహాసంగా వదిలారు. అయితే, ఈ చేపపిల్ల ల్లో ఎంతకీ ఎదుగుదల లేదు. దీంతో ఇవి పెరిగాక పట్టుకుని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఉపాధి పొందాలనుకుంటున్న మత్స్యకారుల ఆశలకు గండి ప డుతోంది. తమను ఆదుకోవాలనే ఉద్దే శంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి నా చేపలు పెరగకపోవడంతో నష్టాల పా లుకావాల్సి వస్తోందని వారంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తెచ్చుకున్న చేపపిల్లలు 8 నెలల్లో కనీసం కిలో నుంచి రెండు కిలోల వరకు పెరిగాయని, ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లలు అరకిలో కూడా పెరగలేదని అంటున్నారు. పెరిగిన చేపల్ని పట్టే వారికిæ కిలోకు రూ.10 – రూ. 15 ఇవ్వాలని, దీనికి తోడు లారీ, ఐస్, బాక్సులు, కూలీలకు కలిపి కిలోకు రూ.80 వరకు ఖర్చవుతుందని, ఇంత చేసినా ఈ పెరగని చేపల ధర రూ.60 – రూ.80 మించడంలేదని వాపోతున్నారు. చిన్న చేపలకు డిమాండ్ తక్కువ మార్కెట్లో చేపలు అమ్మాలన్నా, కొనాలన్నా వాటి కనీస సైజును బట్టి ధర పలుకుతుంది. కిలో కంటే తక్కువున్న వాటికి ధర, డిమాండ్ తక్కువ. ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా పోస్తున్న వాటిలో ఎక్కువగా రవ్వ, బొచ్చ వెరైటీలు ఉన్నాయి. నిజానికి మార్కెట్లో ఈ రకాలకు డిమాండ్ ఎక్కువ. రవ్వ కిలో రూ.140 – రూ.200, బొచ్చ రూ.150 – రూ.220, కొర్రమీను రూ.450 – రూ.650 ధర పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం పోసిన చేపలు అరకిలో కూడా తూగడం లేదు. దీంతో అంత ధరరాక, అయినకాడికి అమ్ముకుంటున్నట్టు మత్స్యకారులు వాపోతున్నారు. కష్టపడి చేపలు పడుతున్నా.. వాటికి కనీస ధర రావట్లేదని, అలాగని చెరువుల్లోనే ఉంచితే చనిపోతున్నాయని అంటున్నారు. అధికారులు ఏమంటున్నారంటే.. చేపపిల్లల్లో నాణ్యతంటూ ఏమీ ఉండదని, ఆశపడి పిల్లలు ఎక్కువగా పోసినా పెరుగుదలలో తేడా వస్తుందని, దాణా సరిగా ఇవ్వకపోవడం కూడా కారణం కావచ్చని అధికారులు చెబుతున్నారు. నాణ్యతపై అనుమానాలుంటే, విచారణ జరిపిస్తామని అంటున్నారు. చిన్న చేపలు కొనడం లేదు ప్రభుత్వం ఉచితంగా పోసిన చేపపిల్లలు ఏడు నెలలైనా కనీసం అరకిలో కూడా పెరగడం లేదు. చిన్నసైజు చేపల్లో ముళ్లు ఎక్కువ ఉంటాయని ప్రజలు కొనడం లేదు. – జి.గణేష్, సిరిసిల్ల, మత్స్యకారుడు నాణ్యతలేకే ఇలా.. చేపపిల్లల్లో నాణ్యత లేకే ఎదగడం లేదు. మత్య్సకారుల మంచి కోసమే చేపపిల్లల పంపిణీ చేపట్టినా.. నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలి. – కనకయ్య, సిద్దిపేట, మత్స్యకారుడు చెరువును బట్టి చేపలు వదలాలి చెరువును బట్టి చేపపిల్లలు పోస్తే బాగుంటుంది. ఇష్టానుసారం చెరువుల్లో వదలడం వల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇచ్చిన చేపల్లో కొన్ని సోడిపట్లపోతున్నాయి. – శ్రవణ్‌కుమార్, భిక్షపతి చేపల వ్యాపారి -
పల్లెల్లో నీలి విప్లవం
జిల్లాలో చేప పిల్లల పంపిణీకి నిధులు మంజూరు మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తోంది డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాధన్నపేట చెరువులో కార్యక్రమం ప్రారంభం నర్సంపేటరూరల్ : తెలంగాణ పల్లెల్లో మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నీలి విప్లవంగా చేపడుతున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని మాధన్నపేట చెరువులో బుధవారం ఆయన చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 46 కోట్లతో 4697 చెరువులు, రిజర్వాయర్లలో మేలురకాలైన బొచ్చె, రోహు, మ్రిగాల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోనే 16 జలాశయాలు, 717 చెరువుల్లో 4.44 లక్షల చేప పిల్లల పంపిణీకి నిధులు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 592 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని 46, 200 మంది మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లలను వందశాతం సబ్సిడీతో, ట్రాలీలను 75 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్లు వివరించారు. నర్సంపేటలోని 66 సొసైటీలకు చేపల పంపిణీతో పాటు 18 సంఘాలకు రూ.10 లక్షలతో కమ్యూనిటీ భవనాలను అందిస్తున్నామని తెలిపారు. ఇందులో రూ.లక్ష సంఘం డిపాజిట్ చేస్తే, రూ.9 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఎంపీ సీతారాంనాయక్, జడ్పీ చైర్ పర్స¯ŒS గద్దల పద్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, నగర పంచాయతీ చైర్మ¯ŒS పాలెల్లి రాంచందర్, టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శ¯ŒSరెడ్డి, సర్పంచ్‌లు ఆకుతోట కుమారస్వామి, సున్నం కొమ్మాలు, మండల అధ్యక్షుడు మచ్చిక నర్సయ్య, కార్యదర్శి గూళ్ల అశోక్, ఎంపీటీసీ అజ్మీర శంకర్ తదితరులు పాల్గొన్నారు.