ప్రభుత్వ స్కూళ్ళకు పాఠ్యపుస్తకాలు
ప్రభుత్వ స్కూళ్ళకు పాఠ్యపుస్తకాలు
Published Mon, Jun 5 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల గోదాము మేనేజర్ శామ్యుల్ పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016 డిసెంబర్ యూడైస్ వివరాల ప్రకారం 27,79,971 పాఠ్యపుస్తకాలు అవసరమని, ఇందులో ఉచిత పాఠ్యపుస్తకాలు 21 లక్షలు అవసరమన్నారు. అయితే 351695 పుస్తకాలు పోను, 18.23 లక్షల పుస్తకాలు డీఈఓ ప్రతిపాదనలు చేశారని అన్నారు. మరో 7.71 లక్షల పుస్తకాలు వస్తే సరిపోతుందన్నారు. మొదటి రోజున దేవనకొండకి 45844 పుస్తకాలు అవసరం ఉండగా, 36336 పాఠ్యపుస్తకాలు, ఆస్పరికి 39,796కుగాను, 33,257 , ఆలూరుకు 41,295కుగాను 32,148, ఆదోనికి 1,42,785కు 99,782, హాలహర్వి మండలానికి 28,432కు 18704, హొళగుందకు 37,523 అవసరం కాగా 24,945, కౌతాళం మండలానికి 55,331 పుస్తకాలకు 35,870 ఆయా మండల కేంద్రాలకు పంపిణీ చేశామన్నారు.
Advertisement