- తొర్రూరులో అత్యధికంగా 81.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
జిల్లాలో జోరు వాన
Published Mon, Sep 12 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
హన్మకొండ : జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పలు చోట్ల వర్షం పడుతూనే ఉంది. తొర్రూరులో అత్యధికంగా 81.2 మిల్లీమీటర్లు, రాయపర్తిలో 80.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే జనగామ డివిజన్‌ను సైతం వానజల్లు పులకింపజేసింది. దాని పరిధిలోని చేర్యాలలో 44.2 మి.మీ, మద్దూరులో 17.4, నర్మెటలో 28, బచ్చన్నపేటలో 16.2, జనగామలో 22.6 మి.మీల వర్షం కురిసింది.
లింగాల ఘన్‌పూర్‌లో 8.4, రఘునాథపల్లిలో 18.2, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 26.8, ధర్మసాగర్‌లో 48.2, హసన్‌పర్తిలో 60.4, హన్మకొండలో 70.2, వర్థన్నపేటలో 50.8, జఫర్‌గఢ్‌లో 13, పాలకుర్తిలో 24.8, దేవరుప్పులలో 8, కొడకండ్లలో 38, రాయపర్తిలో 80.2 మి.మీల వర్షం కురిసింది. తొర్రూరులో 81.2, నెల్లికుదురులో 5.4, నర్సింహులపేటలో 20.6, మరిపెడలో 32.4, డోర్నకల్‌లో 4.4, కురవిలో 3.8, మహబూబాబాద్‌లో 3.6, కేసముద్రంలో 9.8, నెక్కొండలో 5, గూడూరులో 11.8, కొత్తగూడలో 6.4, ఖానాపూర్‌లో 3.4, నర్సంపేటలో 3.4, చెన్నారావుపేటలో 1.2, పర్వతగిరిలో 7.6, సంగెంలో 17.2, నల్లబెల్లిలో 3.4, దుగ్గొండిలో 2.2, గీసుకొండలో 5.2, ఆత్మకూరులో 10.6, శాయంపేటలో 25.2, పరకాలలో 13.6, రేగొండలో 14.2, మొగుళ్లపల్లిలో 33.4, చిట్యాలలో 36, భూపాలపల్లిలో 10.8, ఘణపురంలో 6,8 మి.మీల వర్షం కురిసింది. వెంకటాపూర్‌లో 5.6, గోవిందరావుపేటలో 20, తాడ్వాయిలో 50.4, ఏటూరునాగారంలో 15, మంగపేటలో 25.4, వరంగల్‌లో 47 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
Advertisement
Advertisement