అచ్చం పచ్చని బాతులా.. | boppai green duck | Sakshi
Sakshi News home page

అచ్చం పచ్చని బాతులా..

Published Sun, Jan 1 2017 9:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

boppai green duck

నీటిపట్టుల్లో చకచకా ఈదుతూ, నేల మీద గునగునా నడిచే బాతులు సాధారణంగా తెలుపు, నలుపు రంగుల్లో లేదా ఆ రెండూ కలగలిసిన రంగులో ఉంటాయి. అయితే ‘నేను నీటి, నేలబాపతు బాతును కాదు. అలాంటి వాటి కన్న పై ఎత్తు దాన్ని’ ఓ ‘ఆకుపచ్చని బాతు’ బొప్పాయి చెట్టుపై దర్శనమిచ్చింది. ‘బాతు ఆకుపచ్చగా ఉండడమేమిటి, బొప్పాయి చెట్టుకూ దానికీ సంబంధమేమిటి?’ అనుకుంటున్నారా.. మరేం లేదు.. పేరవరంలో ముళ్లపూడి కృష్ణమోహ¯ŒSరావు వ్యవసాయ క్షేత్రంలో బొప్పాయి చెట్టుకు కాసిన కాయ బాతు ఆకృతిలో ఉంది.  ఆ కాయను చూసిన వారు ‘భలేగుందే’ సంభ్రమం చెందారు. కొన్ని కాయలు జన్యుపరమైన కారణాల వల్ల సహజాకృతికి విరుద్ధంగా రూపొందుతాయని  ఉద్యానవన శాఖాధికారి బబిత చెప్పారు.                                                               
– ఆత్రేయపురం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement