పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం
సామాన్యులు ఇబ్బందులు పడకుండా చూడాలన్న వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ 500, 1000 నోట్ల రద్దు చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుధవా రం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగి న విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ నల్ల ధనాన్ని వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తాము సంపూర్ణంగా మద్దతు నిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్యులు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన అభిప్రాయప డ్డారు. దేశంలో 60 శాతం మంది ప్రజ లు 6,03,000 గ్రామాల్లో నివసిస్తున్నా రని, వారి కోసం కేవలం 38 వేల బ్యాంకులున్నాయని, భారీ ఎత్తున లావాదేవీలు జరపడానికి ఇబ్బందు లు ఏర్పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతంలో జనాభాకు అనుగుణంగా బ్యాంకులు లేవని వాటి శాఖలను మరింతగా విస్తరింప జేయాలని సూచించారు. ప్రభుత్వం నల్లధనం నిర్మూలనకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఇబ్బందులు కలుగ జేయనిదిగా ఉండాలన్నా రు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా విధానం రూపొందిం చాలనేదే తమ అభిప్రాయమన్నారు. ఈ నిర్ణయం వల్ల ధనవంతులు, పారిశ్రామికవేత్తల లావాదేవీలకు ఇబ్బందులు ఉండవని, రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దు వల్ల ఇపుడు ప్రజ లంతా ఆందోళనతో ఉన్నారన్నారు. నల్లధనం నిర్మూలనకు కఠిన నిర్ణయా లు తీసుకోవాలని తమ పార్టీ సూచి స్తోందన్నారు.
రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీని కూడా అడిగితే ఇలాంటివే మరిన్ని సూచనలు చేస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా టీడీపీ నేతలు జోకర్‌ల మాదిరిగా తయారయ్యారని, ప్రతి దానినీ జగన్‌కు ఆపాదిస్తూ విమర్శలు చేయడం అలవాటుగా మారింద న్నారు. జగన్ వద్ద నల్లధనం ఉంటే అధికారంలో ఉన్నది టీడీపీ, వారి మిత్రపక్షమే కదా, చర్యలు తీసుకోవచ్చు కదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.