గాంధేయవాదానికి వారసుడు ‘బోవెరా’ | bovera birthday anversday | Sakshi
Sakshi News home page

గాంధేయవాదానికి వారసుడు ‘బోవెరా’

Published Fri, Sep 2 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

bovera birthday anversday

  • టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌  ఘంటా చక్రపాణి
  • గూడ అంజయ్యకు ‘బోవెరా’ స్మారక అవార్డు ప్రదానం
  • కరీంనగర్‌ కల్చరల్‌: దివంగత బోయినపల్లి వెంకటరామారావు గాంధేయవాదానికి వారసుడని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. బోయినపల్లి వెంకటరామరావు 97వ జయంతి, సారస్వత జ్యోతి మిత్రమండలి స్థాపన దినం, బోవెరా కవితా పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం కరీంనగర్‌లోని ‘బోవెరా’ భవన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ఘంటా చక్రపాణి స్మారకోపన్యాసం చేశారు. బోవెరాతో 35 ఏళ్ల పరిచయం ఉందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌లో బోవెరా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బొవేరా కవితా పురస్కారాన్ని ప్రజాకవి, గాయకుడు గూడ అంజయ్యకు మరణానంతరం ప్రదానం చేయగా ఆయన సతీమణి గూడ హేమనళిని స్వీకరించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ప్రముఖ వాగ్గేయ కారులు గోరటి వెంకన్న, తెలంగాణ అమరవీరుల స్తూపం రూపకర్త ఎక్కా యాదగిరిరావు, సాహితీవేత్తలు ఎంవీ.నర్సింహ రెడ్డి, దాస్యం సేనాధిపతి, గండ్ర లక్ష్మణ్‌రావు, సుంకె వెంకటాద్రి, మాడిశెట్టి గోపాల్, కాళ్ల నారాయణ, తోట లక్ష్మణ్‌రావు, వాల భద్రరావు, సజ్జన కమలాకర్, బోవెరా సంస్థల అధ్యక్షుడు బోయినపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement