నీటిగుంటలో పడి ఏడేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన ఎటపాక మండలంలోని గోగుబాక గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచిబోయిన నాగరాజు, పద్మావతి దంపతుల కుమారుడు హర్షవర్థన్(7) రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో దుస్తులు ఉతికేందుకు వెళుతున్న మహిళలతో కొందరు చిన్నారులు వెళ్లారు.
బాలుడిని మింగేసిన నీటికుంట
Jul 17 2016 9:51 PM | Updated on Jul 12 2019 3:02 PM
గోగుబాక(నెల్లిపాక) : నీటిగుంటలో పడి ఏడేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన ఎటపాక మండలంలోని గోగుబాక గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచిబోయిన నాగరాజు, పద్మావతి దంపతుల కుమారుడు హర్షవర్థన్(7) రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో దుస్తులు ఉతికేందుకు వెళుతున్న మహిళలతో కొందరు చిన్నారులు వెళ్లారు. గ్రామ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో తవ్విన నీటిగుంట వద్ద తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటుండగా, హర్షవర్థన్ అదుపుతప్పి నీటిలో పడి మునిగిపోయాడు. ఈ విషయాన్ని చిన్నారులు సమీపంలో దుస్తులు ఉతుకుతున్న మహిళలకు చెప్పడంతో వారు భయంతో కేకలు వేశారు. దీంతో అటుగా వస్తున్న కొందరు కూలీలు గమనించి అక్కడకు చేరుకుని, నీటిగుంట నుంచి బాలుడిని వెలికితీశారు. అతడిని సమీపంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
Advertisement
Advertisement