వడ్రంగి అనుమానాస్పద మృతి
Published Tue, Jul 19 2016 11:32 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
తాడేపల్లిగూడెం రూరల్ (పశ్చిమగోదావరి) : అనుమానాస్పద స్థితిలో వడ్రంగి మరణించిన ఘటన మంగళవారం తాడేపల్లిగూడెం గుడ్ షెపర్డ్ హైస్కూల్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని మూడో వార్డు వీకర్స్ కాలనీకి చెందిన మల్లాది శ్రీనివాస్(35) కొండాలమ్మగుడి రోడ్డులోని అంజలి వైన్స్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వడ్రంగి పనిచేస్తూ శ్రీనివాస్ జీవనం సాగిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లికి చెందిన శ్రీనివాస్‌కు, కృష్ణా జిల్లా కృత్తివెన్నుకు చెందిన లక్షీ్మశ్రీదేవికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు దివ్యశ్రీ, విజయకిషోర్ ఉన్నారు. ఆరేళ్లపాటు హైదరాబాద్‌లో వడ్రంగి పనిచేసిన శ్రీనివాస్ రెండేళ్ల క్రితం తాడేపల్లిగూడెం వచ్చాడు. ఇక్కడ వీకర్స్ కాలనీలో నివసిస్తూ, పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం స్థానికులు అతడి మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి, ఎస్సై ఎం.సూర్యభగవాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న మృతుని భార్య లక్ష్మీశ్రీదేవి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement