గుండుగొలను భ్రమరాంబ అమ్మవారికి సారె
Published Fri, Feb 3 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
పిఠాపురం :
పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనులో కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారికి పిఠాపురం పాదగయ క్షేత్రంలో వేంచేసియున్న పురూహూతికా అమ్మవారి సారె సమర్పించినట్టు ఆలయ ఈఓ చందక దారబాబు తెలిపారు. గుండుగొలను భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో ఐదు రోజులుగా జరుగుతున్న కోటి కుంకుమార్చనకు అమ్మవారి శక్తి పీఠాల నుంచి సారెలు పంపుతుండగా, ఐదో రోజు ఇక్కడి నుంచి సారె సమర్పించినట్టు చెప్పారు. దేవస్థానం తరపున పసుపు, కుంకుమ చీరలను భ్రమరాంభ అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేయించినట్టు ఆయన తెలిపారు.
Advertisement
Advertisement